Political News

24 ఏళ్ళకే డిప్యూటీ మేయర్… ఒంగోలులో చర్పిత రికార్డ్

నిన్నా మొన్నటి వరకు బ్యాగు భుజాన వేసుకొని కాలేజీకి వెళ్లిన ఆమె ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టింది. తనతో కలిసి బీ టెక్ చదువుకున్న వారంతా హైదరాబాద్, బెంగళూరు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేసుకుంటుంటే ఈ అమ్మాయి మాత్రం సొంత ఊరి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. లక్షల జీతాలు తీసుకొని లక్షణంగా బతకడానికి బదులు ఏమాత్రం జాబ్ సెక్యూరిటీ లేని రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే గెలుపు జెండా ఎగరేయడమే కాకుండా డిప్యూటీ మేయర్ పదవి చేపట్టి ఔరా అనిపించింది. ఆమె పేరు చావలి చర్పిత. వయసు 24 ఏళ్ళు. 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒంగోలు 27 వ వార్డు నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచిన చావలి చర్పిత రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం నుంచి వచ్చారు. కుటుంబ సభ్యులు మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో వున్నారు. వారికి టీడీపీతో 40 ఏళ్ళ అనుబంధం వుంది. ఆమె తాతయ్య చావలి కృష్ణయ్య గతంలో కౌన్సిలర్ గా చేశారు. ఆమె అమ్మమ్మ అనంతమ్మ ప్రస్తుతం అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి కి రాజకీయాలతో నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ గా చేస్తున్నారు. ఆ ప్రభావం చర్పిత మీద వుంది. అందుకే ఆమె అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి ఎంటెక్ పూర్తి చేసినప్పటికీ సాఫ్ట్ వేర్ వైపు వెళ్లకుండా పాలిటిక్స్ వైపు మొగ్గు చూపారు. 

అయితే చర్పిత ఇంట్రెస్ట్ ను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే కాకుండా తెలుగు దేశం పార్టీ కూడా ప్రోత్సాహించింది. రాజకీయాల్లోకి చేరిన వెంటనే వయసు, అనుభవం అని ఆలోచించకుండా 27 వ డివిజన్ నుంచి కార్పొరేటర్ సీటు ఇచ్చింది. గెలిచిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చింది. ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని జెన్ జీ జపం చేయకుండా ఆచరణలో జెన్ జీ కి పట్టం కట్టి పట్టాభిషేకం చేయడంతో ఒంగోలు నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

నిజానికి చర్పిత ఎన్నికల రంగంలోకి అడుగు పెట్టడంతోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఒంగోలు నగర కార్పొరేషన్ లోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించారు. ఎన్నికల ప్రచారంలో సైతం ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె రూపొందించిన  రీల్స్  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. జెన్-జీ యువ నాయకురాలిగా ఆమెకు గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి చేపట్టి నేటి తరాన్ని ఆలోచనలో పడేశారనే చెప్పాలి. బెస్టాఫ్ లక్ చర్పిత.

This post was last modified on November 23, 2026 2:16 pm

Share

Recent Posts

కిరణ్ అబ్బవరం రికార్డ్‌లో ఏం ఉంటుంది

యూత్ హీరో కిరణ్ అబ్బవరం మంచి దూకుడు మీద ఉన్నాడు. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రియాలిటీ ఇటీవలే షూటింగ్ పూర్తి…

8 minutes ago

ఆకాశంలో ఒక తార కాపీనా… డైరెక్ట‌ర్ ఏమ‌న్నాడు?

ఈ శుక్ర‌వారం విడుద‌లై చాలా మంచి టాక్ తెచ్చుకున్న సినిమా.. ఆకాశంలో ఒక తార‌. దుల్క‌ర్ స‌ల్మాన్, సాత్విక వీర‌వ‌ల్లి,…

11 minutes ago

బ‌న్నీ సినిమా గురించి బాసిల్ జోసెఫ్‌ను అడిగితే…

మ‌ల‌యాళంలో గ‌త కొన్నేళ్ల‌లో మోస్ట్ ల‌వ్డ్ యాక్ట‌ర్‌గా ఎదిగాడు బాసిల్ జోసెఫ్‌. డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా…

1 hour ago

మెగావర్స్ వ్యవహారం ఆషామాషీగా లేదు

మెగాస్టార్ చిరంజీవి తొలిసారి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న టాక్ షో మెగావర్స్ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. రోజూ…

2 hours ago

దుల్కర్ సల్మాన్‌ది అదృష్టమా అవగాహనా

పేరుకి మలయాళ హీరోనే అయినా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో దూసుకుపోతున్న తీరు ఒక కేస్ స్టడీలా మారింది. ఎందుకంటే…

4 hours ago

ఎన్నికలకు ముందు లైట్లు… ఓడిపోయాక తొలిగింపు

రాజస్థాన్ కావొచ్చు... ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఇంకే రాష్ట్రమైనా కావొచ్చు. స్థానిక ఎన్నికలంటేనే చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు…

4 hours ago