మలయాళంలో గత కొన్నేళ్లలో మోస్ట్ లవ్డ్ యాక్టర్‌గా ఎదిగాడు బాసిల్ జోసెఫ్. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా అతను బాగానే పరిచయం. ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు దర్శకుడిగా కూడా మంచి గుర్తింపే ఉంది. టొవినో థామస్ హీరోగా అతను రూపొందించిన మిన్నల్ మురళి ఓటీటీలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
దాని కంటే ముందు కూడా రెండు సినిమాలు తీసిన బాసిల్.. మిన్నల్ మురళి తర్వాత మరో సినిమాను డైరెక్ట్ చేయకపోవడం తన అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. కానీ దర్శకుడిగా తన తర్వాతి చిత్రాన్ని అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్‌తో చేస్తాడని వార్తలు రావడం ఎగ్జైట్ చేసింది. శక్తిమాన్ తరహా కథతో ఈ సినిమా ఉంటుందని గత ఏడాది జోరుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటిదాకా ఆ సినిమా గురించి అప్‌డేట్ అయితే లేదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాసిల్ జోసెఫ్‌ను బన్నీ సినిమా గురించి అడిగితే.. అతను ఔనని అనలేదు, అలా అని కాదని కూడా చెప్పలేదు. బన్నీ 25వ సినిమా మీ దర్శకత్వంలోనే అట కదా, అది శక్తిమాన్ కథతో తెరకెక్కుతోందట కదా అని అడిగితే.. బాసిల్ నవ్వేశాడు. జరగాల్సినవి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతాయని.. వాటిని అలా జరగనివ్వాలని, అంతే తప్ప ముందే మాట్లాడకూడదని బాసిల్ అన్నాడు.
ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, కథ శక్తిమాన్ తరహాలో ఉంటుందా అని అంటే.. ఏదీ తాను చెప్పలేనని.. మిగతా సినిమాల ప్లానింగ్‌లా ఆ ప్రాజెక్టును ప్లాన్ చేయడం సాధ్యం కాదని.. అదొక ప్రాసస్ అని, చాలా టైం పడుతుందని, ఎంతో అనిశ్చితి ఉంటుందని.. కాబట్టి ఏదైనా జరిగాక ఇది జరిగింది అని చెప్పగలనే తప్ప ఇప్పుడు బన్నీతో సినిమా గురించి ఇప్పుడేమీ చెప్పలేనని బాసిల్ స్పష్టం చేశాడు.
బాసిల్ మాటల్ని బట్టి చూస్తే అతడి దర్శకత్వంలో బన్నీతో సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ.. ఈ ప్రాజెక్ట్ 100 పర్సంట్ ఫైనలైజ్ కాలేదని అర్థమవుతోంది. ఐతే ఈ కాంబోలో సినిమా రావడానికి స్కోప్ అయితే ఉందన్నది కూడా వాస్తవం. ప్రస్తుతం రాకా మూవీ చేస్తున్న బన్నీ.. లోకేష్ కనకరాజ్, బోయపాటి సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 23, 2026 1:09 pm
మెగాస్టార్ చిరంజీవి తొలిసారి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న టాక్ షో మెగావర్స్ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. రోజూ…
పేరుకి మలయాళ హీరోనే అయినా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో దూసుకుపోతున్న తీరు ఒక కేస్ స్టడీలా మారింది. ఎందుకంటే…
రాజస్థాన్ కావొచ్చు... ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఇంకే రాష్ట్రమైనా కావొచ్చు. స్థానిక ఎన్నికలంటేనే చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు…
మరో రెండు సంవత్సరాల్లో తెలంగాణా సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొందరికి…
బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే వెంటనే వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తాం. అయితే చాలామంది మాత్రం బ్రాండ్ ఏదైనా సరే…
సింహాచలం అప్పన్న భక్తులకు ఇక నుంచి ఆ డ్రస్సుల్లో ప్రవేశం లేదు. ఇప్పటివరకు ఆలయానికి వచ్చే భక్తులు తమకు నచ్చిన…