Movie News

బుల్లితెర దేవరకు మోక్షం దొరికింది

జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్యాన్ ఇండియా హీరో, ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమాగా దేవర ఎంత సంచలనం రేపిందో చూశాం. కొరటాల శివ దర్శకత్వంలో అనిరుధ్ రవిచందర్ సంగీతంతో రెండేళ్ల క్రితం సృష్టించిన రికార్డులు ఇప్పటికీ తారక్ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. దేవర పార్ట్ 2 వస్తుందో లేదో కానీ మొదటి భాగం తాలూకు జ్ఞాపకాలు, థియేటర్ వైబ్స్ వాళ్ళు ఎప్పటికి మర్చిపోలేరు. నెట్ ఫ్లిక్స్ లోనూ వ్యూస్ పరంగా దేవర కొత్త మైలురాళ్ళు నమోదు చేసింది.

ఇదంతా బాగానే ఉంది కానీ ఒక్క లోటు దేవరని వెంటాడుతూ వచ్చింది. అదే శాటిలైట్ హక్కులు అమ్ముడుపోకపోవడం. నిర్మాత కళ్యాణ్ రామ్ ఆశించిన ధర రాకనో లేక అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఛానల్స్ రిస్క్ చేయలేకపోవడం వల్లనో ఏదైతేనేం బుల్లితెర మీద చూడాలని వెయిట్ చేస్తున్న అభిమానులకు నిరాశ మిగిలింది. ఇంత సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత సోని తెలుగు ఛానల్ దేవర హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ధర రివీల్ చేయలేదు కానీ మంచి డీల్ కుదిరిందట.

త్వరలోనే సోనీ తెలుగు ఛానల్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్ సినిమాలను కొనే పనిని టీమ్ ఉదృతం చేసింది. కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ కొనడం అందులో భాగమే. దేవర లాంటి పెద్ద చిత్రాలు తీసుకోవడం ద్వారా టీవీ ఛానల్స్ చూసే మిడిల్ క్లాస్ ఆడియన్స్ ని సోనీ తెలుగు టార్గెట్ చేసుకున్నట్టవుతుంది. దేవర ఓటిటిలో తప్ప బయట ఇంకెక్కడా రాలేదు. సో బుల్లితెర మీద మొదటిసారి వస్తున్నప్పుడు ఆదరణ దక్కే అవకాశాలను కొట్టి పారేయలేం.

దీని సంగతలా ఉంచితే దేవర విషయంలో జరిగిన జాప్యం ఒక పాఠంగా తీసుకోవాలి. ఒకప్పటిలా శాటిలైట్ మార్కెట్ బలంగా లేదు. ఓటిటిలు వచ్చాక జనాలు ప్రకటనలు భరిస్తూ మూడు గంటలు కదలకుండా టీవీ ముందు కూచునే పరిస్థితులు లేవు. తమకు అనుకూలమైన టైంలో చూసే వెసులుబాటు ఇచ్చే ఓటిటికు బాగా అలవాటు పడిపోయారు. అందుకే ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ సినిమాలు కొనే విషయంలో దూకుడు బాగా తగ్గించేశాయి. దానికి తగ్గట్టే రేట్లు కూడా డౌన్ అయ్యాయి. 

This post was last modified on November 23, 2026 2:33 pm

Share

Recent Posts

24 ఏళ్ళకే డిప్యూటీ మేయర్… ఒంగోలులో చర్పిత రికార్డ్

నిన్నా మొన్నటి వరకు బ్యాగు భుజాన వేసుకొని కాలేజీకి వెళ్లిన ఆమె ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ప్రజా జీవితంలోకి…

22 minutes ago

కిరణ్ అబ్బవరం రికార్డ్‌లో ఏం ఉంటుంది

యూత్ హీరో కిరణ్ అబ్బవరం మంచి దూకుడు మీద ఉన్నాడు. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రియాలిటీ ఇటీవలే షూటింగ్ పూర్తి…

27 minutes ago

ఆకాశంలో ఒక తార కాపీనా… డైరెక్ట‌ర్ ఏమ‌న్నాడు?

ఈ శుక్ర‌వారం విడుద‌లై చాలా మంచి టాక్ తెచ్చుకున్న సినిమా.. ఆకాశంలో ఒక తార‌. దుల్క‌ర్ స‌ల్మాన్, సాత్విక వీర‌వ‌ల్లి,…

30 minutes ago

బ‌న్నీ సినిమా గురించి బాసిల్ జోసెఫ్‌ను అడిగితే…

మ‌ల‌యాళంలో గ‌త కొన్నేళ్ల‌లో మోస్ట్ ల‌వ్డ్ యాక్ట‌ర్‌గా ఎదిగాడు బాసిల్ జోసెఫ్‌. డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా…

1 hour ago

మెగావర్స్ వ్యవహారం ఆషామాషీగా లేదు

మెగాస్టార్ చిరంజీవి తొలిసారి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న టాక్ షో మెగావర్స్ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. రోజూ…

2 hours ago

దుల్కర్ సల్మాన్‌ది అదృష్టమా అవగాహనా

పేరుకి మలయాళ హీరోనే అయినా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో దూసుకుపోతున్న తీరు ఒక కేస్ స్టడీలా మారింది. ఎందుకంటే…

4 hours ago