తమిళ స్టార్ హీరో ధనుష్ కొత్త సినిమా ‘ఓం’ మొన్న భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకు తమిళంలోనే కాదు.. తెలుగులోనూ నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, నసీరుద్దీన్ షా, శ్రీలీల.. ఇలాంటి కాస్టింగ్ పెట్టుకుని.. ‘అమరన్’ లాంటి సినిమా తీసిన రాజ్‌కుమార్ పెరియస్వామి ఇంత మామూలు సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ సినిమాకు రివ్యూలు బాలేవు. మౌత్ టాక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది.
కానీ ‘ఓం’ ఈ నెగెటివిటీని తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ డబ్బింగ్ సినిమాకు వస్తున్న స్పందన ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలి రోజు ఉదయమే నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. హైదరాబాద్ సహా పలు చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. మైత్రి విమల్, మైత్రి గంగ సహా పలు సింగిల్ స్క్రీన్లలో ప్రతి షో హౌస్ ఫుల్ కావడం విశేషం. రెండో రోజు కూడా ‘ఓం’ హవా కొనసాగింది. తెలుగులో ఒక పెద్ద హీరో సినిమాకు రిలీజ్ రోజు కనిపించే థియేటర్ సెలబ్రేషన్స్ ‘ఓం’ మూవీకి రెండో రోజు కూడా కనిపించడం విశేషం.
ధనుష్‌కు తెలుగులో ఈ రేంజిలో ఫాలోయింగ్ ఉందా.. అతణ్ని ఇంతగా అభిమానిస్తారా అని ఆశ్చర్యం కలిగే రేంజిలో ‘ఓం’ను సెలబ్రేట్ చేస్తుండడం విశేషం. సార్, కుబేర లాంటి తెలుగు సినిమాలు చేసి హిట్లు కొట్టడంతో ధనుష్‌కు ఇక్కడ ఫ్యాన్ బేస్ బాగానే పెరిగినట్లుంది. అలాగే అదిరిపోయే కాస్టింగ్, ఇంట్రెస్టింగ్ ప్రోమోల వల్ల కూడా ఈ సినిమా ప్రేక్షకులను రప్పిస్తున్నట్లుంది. వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కానీ.. ఇప్పటికైతే స్పందన అంచనాలకు మించే ఉంది.
రూ.5 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లతో తెలుగులో తొలి రోజు ధనుష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘ఓం’ రికార్డు నెలకొల్పడం విశేషం. వీకెండ్ రికార్డు కూడా బద్దలయ్యేలా ఉంది. ఓవైపు ఈఎన్ఈ రిపీట్, ఆకాశంలో ఒక తార లాంటి మంచి టాక్‌తో నడుస్తున్న సినిమాలతో పోటీపడుతూ.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న డబ్బింగ్ సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు రాబట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on November 23, 2026 2:25 pm
జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్యాన్ ఇండియా హీరో, ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమాగా దేవర ఎంత సంచలనం…
నిన్నా మొన్నటి వరకు బ్యాగు భుజాన వేసుకొని కాలేజీకి వెళ్లిన ఆమె ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ప్రజా జీవితంలోకి…
యూత్ హీరో కిరణ్ అబ్బవరం మంచి దూకుడు మీద ఉన్నాడు. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రియాలిటీ ఇటీవలే షూటింగ్ పూర్తి…
ఈ శుక్రవారం విడుదలై చాలా మంచి టాక్ తెచ్చుకున్న సినిమా.. ఆకాశంలో ఒక తార. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి,…
మలయాళంలో గత కొన్నేళ్లలో మోస్ట్ లవ్డ్ యాక్టర్‌గా ఎదిగాడు బాసిల్ జోసెఫ్. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా…
మెగాస్టార్ చిరంజీవి తొలిసారి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న టాక్ షో మెగావర్స్ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. రోజూ…