Movie News

ఆకాశంలో ఒక తార కాపీనా… డైరెక్ట‌ర్ ఏమ‌న్నాడు?

ఈ శుక్ర‌వారం విడుద‌లై చాలా మంచి టాక్ తెచ్చుకున్న సినిమా.. ఆకాశంలో ఒక తార‌. దుల్క‌ర్ స‌ల్మాన్, సాత్విక వీర‌వ‌ల్లి, శ్రుతి హాస‌న్ ముఖ్య పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని ప‌వ‌న్ సాదినేని రూపొందించ‌గా.. గీతా ఆర్ట్స్, వైజ‌యంతీ మూవీస్ లాంటి పెద్ద బేన‌ర్లు దీని ప్రొడ‌క్ష‌న్లో భాగ‌మ‌య్యాయి. లెజెండ‌రీ డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ గుణ్ణం గంగ‌రాజు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాట‌లు అందించ‌డం విశేషం.

ఐతే ఇలాంటి కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా మీద కాపీ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. డియ‌ర్ ఆస్ట్రోనాట్ పేరుతో తెర‌కెక్కిన మ‌రో చిత్రం క‌థ కూడా ఇదే అని.. దాని ద‌ర్శ‌కుడు ముందు ఈ క‌థ‌తో షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్‌లో పెడితే, దాని ఆధారంగా ఆకాశంలో ఒక తార టీం సినిమా తీసేసింద‌ని ఒక ప్ర‌చారం న‌డిచింది సోష‌ల్ మీడియాలో. కానీ దీని మీద అటు డియ‌ర్ ఆస్ట్రోనాట్ టీం కానీ, ఇటు ఆకాశంలో ఒక తార బృందం కానీ అధికారికంగా ఏమీ స్పందించ‌లేదు.

ఐతే ఆకాశంలో ఒక తార సినిమా రిలీజై మంచి స్పంద‌న తెచ్చుకుంటుండ‌గా.. దీనికి పోటీగా రిలీజ్ కావాల్సిన డియ‌ర్ ఆస్ట్రోనాట్ విడుద‌ల కాలేదు. కాగా ఆకాశంలో ఒక తార ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాదినేని ఒక ఇంట‌ర్వ్యూలో.. త‌న సినిమా మీద వ‌చ్చిన కాపీ ఆరోప‌ణ‌ల‌పై స్పందించాడు. తాను దివంగ‌త వ్యోమ‌గామి క‌ల్ప‌న చావ్లా గురించి ఆమె భ‌ర్త రాసిన బ‌యోగ్ర‌ఫీలో ఒక ఎపిసోడ్ ఆధారంగా ఆకాశంలో ఒక తార క‌థ‌ను త‌యారు చేసుకున్న‌ట్లు ప‌వ‌న్ వెల్ల‌డించాడు.

అంతే త‌ప్ప ఏ సినిమా క‌థ‌నూ తాను కాపీ కొట్ట‌లేద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశాడు. ఒక‌వేళ తాను అలా చేస్తే గుణ్ణం గంగ‌రాజు లాంటి లెజెండరీ ఫిలిం మేక‌ర్ ఊరుకుంటారా, హెడ్ మాస్ట‌ర్‌లాగా బెత్తం ప‌ట్టుకుని త‌మ‌ను కొట్ట‌రా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించాడు. కొన్ని రోజుల ముందు చంద్రయాన్ అనే సినిమా వ‌చ్చింద‌ని, అందులో కూడా రాకెట్‌ను పైకి పంప‌డం మీద క‌థ న‌డుస్తుంద‌ని.. దాని విష‌యంలో తాను కొంత బాధ ప‌డ్డాన‌ని, అలా అని ఆ క‌థ‌, త‌మ‌ది ఒక‌టే అన‌లేం క‌దా అని ప‌వ‌న్ అన్నాడు. మ‌న సినిమా వ‌స్తున్న‌పుడే అలాంటి క‌థ‌తో మ‌రో సినిమా వ‌స్తే ఎవ‌రికైనా బాధ క‌లుగుతుంద‌ని, అంత‌మాత్రాన‌ కాపీ అన‌డం క‌రెక్ట్ కాద‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశాడు.

This post was last modified on November 23, 2026 2:09 pm

Share

Recent Posts

24 ఏళ్ళకే డిప్యూటీ మేయర్… ఒంగోలులో చర్పిత రికార్డ్

నిన్నా మొన్నటి వరకు బ్యాగు భుజాన వేసుకొని కాలేజీకి వెళ్లిన ఆమె ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ప్రజా జీవితంలోకి…

4 minutes ago

కిరణ్ అబ్బవరం రికార్డ్‌లో ఏం ఉంటుంది

యూత్ హీరో కిరణ్ అబ్బవరం మంచి దూకుడు మీద ఉన్నాడు. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రియాలిటీ ఇటీవలే షూటింగ్ పూర్తి…

8 minutes ago

బ‌న్నీ సినిమా గురించి బాసిల్ జోసెఫ్‌ను అడిగితే…

మ‌ల‌యాళంలో గ‌త కొన్నేళ్ల‌లో మోస్ట్ ల‌వ్డ్ యాక్ట‌ర్‌గా ఎదిగాడు బాసిల్ జోసెఫ్‌. డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా…

1 hour ago

మెగావర్స్ వ్యవహారం ఆషామాషీగా లేదు

మెగాస్టార్ చిరంజీవి తొలిసారి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న టాక్ షో మెగావర్స్ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. రోజూ…

2 hours ago

దుల్కర్ సల్మాన్‌ది అదృష్టమా అవగాహనా

పేరుకి మలయాళ హీరోనే అయినా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో దూసుకుపోతున్న తీరు ఒక కేస్ స్టడీలా మారింది. ఎందుకంటే…

4 hours ago

ఎన్నికలకు ముందు లైట్లు… ఓడిపోయాక తొలిగింపు

రాజస్థాన్ కావొచ్చు... ఆంధ్రప్రదేశ్ కావొచ్చు.. ఇంకే రాష్ట్రమైనా కావొచ్చు. స్థానిక ఎన్నికలంటేనే చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు…

4 hours ago