‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని అమెజాన్‍లో చూసిన తెలుగువారిలో ఎవరూ కూడా పవన్‍కళ్యాణ్‍ను అయ్యప్ప నాయర్ పాత్రలో ఊహించుకోలేదు. నిజానికి ఆ సినిమా హక్కులు తీసుకున్న వాళ్లు కూడా బాలకృష్ణ లేదా రవితేజ లేదా వెంకటేష్ అనుకున్నారు. అయితే పవన్‍కళ్యాణ్ స్వయంగా ముచ్చటపడి ఆ పాత్ర చేయడానికి ముందుకొచ్చాడు. పవన్ రాకతో ఆ సినిమా స్వరూపం మారిపోయింది. పవన్ ఇమేజ్‍కు అనుగుణంగా మార్పు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకు చేయి తిరిగిన త్రివిక్రమ్ సాయం తీసుకున్నారు.
మలయాళం సినిమా సోల్ చెడకుండా, పవన్ కళ్యాణ్ చేస్తోన్న పాత్ర ఔచిత్యం దెబ్బ తినకుండా త్రివిక్రమ్ మార్పులు చేసాడట. ఆ మార్పులు పవన్‍కి, రానాకి అలాగే ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న సాగర్ చంద్రకు కూడా చాలా కన్విన్సింగ్‍గా అనిపించాయట. అసలు పవన్ కళ్యాణ్ ఇందులో ఎలా ఫిట్ అవుతాడనే ప్రశ్న పోయి ఇది అచ్చంగా పవన్ కళ్యాణ్ సినిమానే అన్నట్టుగా త్రివిక్రమ్ తన మాయాజాలం చూపించాడట. దబంగ్ చూసిన వారికి గబ్బర్‍సింగ్ ఎంత డిఫరెంట్‍గా కనిపించాడో ఈ చిత్రం కూడా అంతే కొత్తగా అనిపిస్తుందని, ఇది పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్కు సినిమా అంటారనేది ఇండస్ట్రీ మాట.