
మొదటి సినిమా సీతారామంతోనే.. సీత పాత్రలో కనిపించి.. తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరింత మ్యాజిక్ చేసింది. ఈ రెండు సినిమాలతో.. ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని నిరూపించుకుంది.
కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే ఎలా అన్న.. అప్పుడే ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. తన హిట్‌లకు బ్రేక్ వేసిన ఈ సినిమా.. తన నటనకు, అందానికి మాత్రం బ్రేక్ వేయలేకపోయింది.
ఇక ఈ మధ్యనే డాకాయిట్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ హీరోయిన్.. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

సినిమాలతోనే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో కూడా అభిమానులను తెగ కవ్విస్తూ ఉంటుంది ఈ అందాల భామ.
ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్‌కే కొత్త అందం వచ్చినట్లు ఉంటుంది. ఈ క్రమంలో బ్లాక్ డ్రెస్ లో తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. సొగసైన కళ్లతో, కైపెక్కించే చూపులతో, బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతూ, గ్రీన్ కలర్ చెవిపోగులు ధరించి యువతకు మత్తెక్కించేలా ఫొటోలు షేర్ చేసింది.
Esquire India కోసం ఈ హీరోయిన్ చేసిన ఈ ఫొటోషూట్.. యువకుల మనసుల్లో ఆమెపై మరింత ప్రేమ పెరిగేలా చేస్తున్నాయి. మొత్తం పైన బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేసే అందంతో మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కెవ్వు కేక పుట్టిస్తోంది. మరోపక్క ఈ హీరోయిన్ మళ్లీ తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తుంది అని అభిమానులను మరింత వెయిట్ చేసేలాగా కూడా చేస్తున్నాయి.

Gulte Telugu Telugu Political and Movie News Updates