ప‌వ‌న్‌తో బెంగాల్ టైగ‌ర్ చేద్దామ‌నుకుంటే

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ర‌చ్చ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కాంబినేష‌న్లో ఒక సినిమా కోసం స‌న్నాహాలు జ‌రిగి.. ఏడాదికి పైగా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న సినిమా అనుకోకుండా ఆగిపోవ‌డం గుర్తుండే ఉంటుంది. అది గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ అన్న సంగ‌తి కూడా తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఏడాదికి పైగా జ‌ర్నీ చేసిన సంప‌త్.. చివ‌రికి ఈ ప్రాజెక్టు నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాడు. త‌ర్వాత అత‌ను గౌత‌మ్ నంద మూవీ చేశాడు. ప‌వ‌నేమో.. త‌న స్క్రిప్టును బాబీ చేతికి ఇచ్చి స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చేశాడు. ఈ సినిమా నుంచి తాను ఎందుకు బ‌య‌టికి రావాల్సి వ‌చ్చిందో సంప‌త్ త‌న కొత్త చిత్రం భోగి ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

రచ్చ పెద్ద హిట్ కావడంతో ఆ త‌ర్వాత తాను బెంగాల్ టైగ‌ర్ క‌థ త‌యారు చేసుకుని ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డానికి ట్రై చేసిన‌ట్లు సంప‌త్ తెలిపాడు. కానీ ప‌వ‌న్ మాత్రం తాను రెడీ చేసిన గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ స్క్రిప్టుతో సినిమా చేయ‌మ‌న్నార‌ని సంప‌త్ తెలిపాడు. ఆ స్క్రిప్టు మీద తాను ప‌ని చేశాన‌ని.. కానీ ప‌వ‌న్‌కు ఉన్న వేరే క‌మిట్మెంట్ల వ‌ల్ల ఈ సినిమా ఆల‌స్యం అయింద‌ని, అప్ప‌టికే ఏడాదికి పైగా త‌న టైం వేస్ట్ కావ‌డంతో మ‌రింత స‌మ‌యం త‌న‌ను వెయిట్ చేయించ‌డం ప‌వ‌న్‌కు ఇష్టం లేక‌పోయింద‌ని సంప‌త్ తెలిపాడు. 

అప్పుడే తాను ఇంకా టైం ప‌ట్టేలా ఉంటే వేరే సినిమా చేసుకుని వ‌స్తాన‌ని చెప్ప‌గా, ప‌వ‌న్ స‌రే అన్నాన‌ని.. తాను బెంగాల్ టైగ‌ర్ ప‌నిలో బిజీగా ఉన్న టైంలో ఆయ‌న వేరే ద‌ర్శ‌కుడితో స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చేశార‌ని సంప‌త్ తెలిపాడు. ఈ విష‌యంలో ఎలాంటి వివాదం లేద‌ని, అంతా చాలా స్మూత్‌గా జ‌రిగింద‌ని సంప‌త్ తెలిపాడు. త‌న విష‌యంలో ప‌వ‌న్ ఫీల‌య్యార‌ని, త‌న‌తో ఒక సినిమా చేయాల‌ని వేరే నిర్మాతల ద‌గ్గ‌ర కూడా ప్ర‌స్తావించార‌ని త‌ర్వాత తెలిసింద‌ని.. అది త‌న‌కు మంచిగా అనిపించింద‌ని సంప‌త్ చెప్పాడు. శ‌ర్వానంద్ హీరోగా సంపత్ రూపొందించిన భోగి ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.