ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన ఈ నగరానికి ఏమైంది థియేటర్ పరంగా ఆశించిన పెద్ద విజయం అందుకోలేదన్నది వాస్తవం. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అభినవ్ గోమటం ఏదో బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఫీలయ్యాడు కానీ నిజానికిది సక్సెస్ అయ్యింది రీ రిలీజ్ టైంలో. చాలా గ్యాప్ తర్వాత జెన్ జీ ఆడియన్స్ కోసం మళ్ళీ విడుదల చేస్తే భారీ వసూళ్లు తెచ్చింది. అందుకే ఈ నగరానికి ఏమైంది రిపీట్ పేరుతో సీక్వెల్ కి శ్రీకారం చుట్టి షూటింగ్ కూడా పూర్తి చేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్.
నిన్న ట్రైలర్ వచ్చింది. కథేంటో దాచకుండా చెప్పారు. నలుగురు స్నేహితులు ఇందులోనూ కొనసాగారు. పాత్ బ్రేకింగ్ మూవీ తీయాలని కంకణం కట్టుకున్న వివేక్ (విశ్వక్ సేన్) తనతో పాటు ఫ్రెండ్స్ ని కూడా ఊహించని ఊబిలో దింపుతాడు. ఈ క్రమంలో సరదాగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి అవమానాలు, ప్రమాదాలు చుట్టుముడతాయి. ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఇంతకీ వివేక్ రాసుకున్న స్టోరీ ఏంటి, అందులో పాత్రలుగా వీళ్లేందుకు మారారనేది తెరమీద చూడాలి.
ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఈ నగరానికి ఏమైంది రిపీట్ లో సాలిడ్ కంటెంట్ అయితే కనిపిస్తోంది. ట్రెండీ జోకులతో పాటు ఫిలిం మేకింగ్ కి సంబంధించిన సరదా బ్యాక్ డ్రాప్ పెట్టడం కనెక్ట్ అయ్యేలా ఉంది. దానికి తోడు వివేక్ సాగర్ సంగీతం. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ మరింత ప్లస్ అవుతున్నాయి. ఈసారి శివాత్మిక, ప్రియదర్శి రామ్ లాంటి కొత్త క్యారెక్టర్లను జోడించడం ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. విశ్వక్ సేన్ చాలా గ్యాప్ తర్వాత తనకు సూటయ్యే పాత్రలో ఆకట్టుకునేలా ఉన్నాడు.
మొత్తానికి ఈఎన్ఈ రిపీట్ నవంబర్ 19 మంచి ఓపెనింగ్ తెచ్చుకునేందుకు సరిపడా కంటెంట్ అయితే శాంపిల్ రూపంలో ఇచ్చింది. యూత్ పెట్టుకునే అంచనాలు నిలబెట్టుకుంటే ఈసారి హిట్టు కొట్టొచ్చు. పెళ్లి చూపులు తర్వాత దర్శకుడిగా చాలా బ్రేకులు తీసుకున్న తరుణ్ భాస్కర్ కీడా కోలా తర్వాత కేవలం ఆర్టిస్టుగా కనిపించాడు తప్పించి డైరెక్షన్ చేయలేదు. ఇప్పుడీ ఈ నగరానికి ఏమైంది రిపీట్ తో కనక కంబ్యాక్ అయితే తన నుంచి వరసగా సినిమాలు ఆశించవచ్చనేది మూవీ లవర్స్ కోరిక.
Gulte Telugu Telugu Political and Movie News Updates