అంబానీల అద్భుత కార్యం

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుల జాబితాలో ఉండే ముకేష్‌ అంబానీ కుటుంబానికి ఇండియాలో అస‌లు పోటీయే లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వారి సంప‌ద పెరుగుతూ ఉంటుంది. ఇటీవ‌లే జియో ప‌బ్లిక్ ఇష్యూను మొద‌లుపెట్ట‌డంతో వారి సంప‌ద ఎక్క‌డికో వెళ్లిపోయింది. ల‌క్ష‌ల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ముకేష్ అంబానీ కుటుంబం.. సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ముందుంటుంది.

కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వేల కోట్ల‌తో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటుంది. దాంతో సంబంధం లేకుండా ప్ర‌త్యేకంగా చేప‌ట్టే ఛారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలానే ఉన్నాయి. తాజాగా అంబానీ ఫ్యామిలీ ఒక గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎవ్వ‌రి అండా లేని అభాగ్యులు 5 వేల మందికి ఆశ్ర‌యం క‌ల్పించింది.

త‌ల్లిదండ్రులు లేని అనాథ పిల్ల‌లు.. పిల్లల ఆద‌ర‌ణ‌కు దూర‌మైన సీనియ‌ర్ సిటిజ‌న్లు.. ఇంకా వికలాంగులు.. ఇలా 5 వేల‌మంది కోసం ఒక టౌన్ షిప్ నిర్మించ‌బోతోంది అంబానీల ఫ్యామిలీ. ముకేశ్ అంబాని భార్య నీతా అంబాని పుట్టిన రోజు సంద‌ర్భంగా నీతా అంబాని అనంత్ ఆశ్ర‌య్ పేరుతో ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. దీనికి భూమిపూజ కూడా చేశారు.

అనాథ పిల్ల‌లు, వృద్ధుల కోసం ఆశ్ర‌మాలు న‌డుపుతారు కానీ.. ఇలా ఒకే చోట 5 వేల‌మందికి ఉత్త‌మ సౌక‌ర్యాల‌తో టౌన్ షిప్ నిర్మించ‌డం మాత్రం అరుదు. అంబానీల కుటుంబానికి సంబంధించిన సేవా కార్య‌క్ర‌మాల‌న్నీ రిల‌యెన్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతాయి. దానికి నీతా అంబానీనే డైరెక్ట‌ర్. త‌న‌తో పాటు చిన్న కొడుకు అనంత్ పేరు మీద ఈ టౌన్‌షిప్‌ను నీతా నిర్వ‌హించ‌బోతున్నారు.