వృషకర్మ అడ్వాన్స్ అవ్వడం మంచిదే

డిసెంబర్ 4 విడుదల కాబోతున్న వృషకర్మ ముందుగానే ప్రమోషన్ల పర్వానికి తెర తీసింది. రిలీజ్ డేట్ వరకు మధ్యలో ఉన్న పండగ దీపావళి ఒకటే కావడంతో ఆ రోజు ప్రీమియర్ కాబోయే స్పెషల్ ప్రోగ్రామ్స్ కోసం నాగచైతన్య, మీనాక్షి చౌదరితో పాటు టీమ్ రంగంలోకి దిగింది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ మిస్టిక్ థ్రిల్లర్ కు అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

వృషకర్మ బ్లాక్ బస్టర్ కావడం చైతుకి చాలా కీలకం. ఎందుకంటే తండేల్ తో హిట్టు కొట్టినప్పటికీ ఇంకా పెద్ద స్కేల్ లో విజయం సాధించాలనే లక్ష్యంతో వృషకర్మ కోసం ఏడాదికి పైగానే సమయం ఖర్చు పెట్టాడు. స్క్రిప్ట్ కోసమే నెలల తరబడి సమయం టైం వెచ్చించాడు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఫైనల్ అవుట్ ఫుట్ సిద్ధం చేశారు. ఎంతవరకు నిజమో కానీ కొన్ని రషెస్ చూసిన ఫిలిం నగర్ జనాలు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు

విశ్వక్ సేన్ లెగసి, శ్రద్దా కపూర్ ఈధా తప్ప డిసెంబర్ మొదటివారంలో చెప్పుకోదగ్గ పోటీ లేదు. ఫౌజీ తప్పుకోవడం వీటికి అనుకూలంగా మారింది. అందుకే వృషకర్మ నిర్మాతలు తెలివిగా అలోచించి డేట్ లాక్ చేసుకున్నారు. ఇరవై రోజుల ఓపెన్ స్పేస్ దొరుకుతుంది కాబట్టి క్రిస్మస్ దాకా థియేటర్ రన్ దక్కితే చాలు మంచి లాభాలు కళ్లజూడవచ్చు. ఆ తర్వాత ఎలాగూ కింగ్ 100, బాలయ్య దాదా, షారుఖ్ ఖాన్ కింగ్ వచ్చేస్తాయి కాబట్టి ఆలోగా గట్టెక్కితే సూపర్ హిట్ స్టాంప్ పడుతుంది.

నిధుల వేట, రాజవంశ శాపం, పురాతన గుహలు, అంతుచిక్కని దైవ రహస్యాల చుట్టూ అల్లుకున్న పాయింట్ తో కార్తీక్ దండు ఈసారి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తారని వినికిడి. చైతు ఆ నమ్మకంతోనే స్క్రిప్ట్ విషయంలో రాజీ లేకుండా లేట్ అవుతున్నా సరే పూర్తి సహకారం అందించాడు. తమ్ముడు అఖిల్ ఆ మధ్య లెనిన్ తో మంచి విజయం అందుకుని వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టాడు. ఇప్పుడు అన్నయ్య నాగ చైతన్య కూడా ఆ ఫీట్ అందుకుంటే ఒకే ఏడాదిలో అక్కినేని బ్రదర్స్ కు మంచి మైలురాయి దక్కినట్టే