కిరాతకుడు హేమంత్ పై కాల్పులు – సంబరాల్లో ప్రజలు

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురించేసింది. ఈ కేసుకు సంబందించి నిందితుడు హేమంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సమాచారం ఇప్పుడు కొంతమందిని సంతోషానికి గురి చేసింది. ముఖ్యంగా రాప్తాడు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

రాప్తాడు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గోపిక రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి చదువుకుంటుంది. ఆమెకు బాబాయ్ వరసయ్యే హేమంత్ కొన్ని రోజులుగా పెళ్లి చేసుకుంటానంటూ వెంట పడుతున్నాడు. దానికి ఆ బాలిక తిరస్కరించింది. ఇది మనసులో పెట్టుకున్న హేమంత్ శనివారం తరగతి గదిలో చదువుంటుండగా చొరబడిన హేమంత్ ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసి విచక్షణారహితంగా గాయపరిచాడు. రక్తం మడుగులో పడిన గోపికను చూసి పరారయ్యడు.

రెండు రోజులుగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంత్ వున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులపై దాడి చేసిన హేమంత్ పారిపోతుండగా ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్ ను ఆసుపత్రికి తరలించారు.

అయితే ఈ విషయం నిముషాల్లోనే రాష్ట్రం మొత్తం వ్యాపించింది. హేమంత్ పై కాల్పులు జరిపిన పోలీసులపై ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. రాప్తాడు ప్రజలైతే రాక్షసుడి పీడ విరగడవ్వాలని కోరుకుంటూ బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలోని ఇతరా ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన స్పందన కనిపిస్తుంది. కిరాతకుడు హేమంత్ ను విడిచి పెట్ట కూడదని ప్రజలు కోరుకుంటున్నారు.