Movie News

‘ఆదర్శ కుటుంబం’పై ‘జిమ్ జిమ్ తార’ లక్ష్మి ఫైర్

సోషల్ మీడియా వల్ల ఎప్పుడు ఎవరు హీరోలవుతారో, జీరోలవుతారో చెప్పలేం. అనుకోకుండా పాపులారిటీ సంపాదించి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతుంటారు కొంతమంది. ఈ మధ్య కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మి ఆంటీ అనే మహిళ ఇలాంటి పాపులారిటీనే సంపాదించింది. ఆమె పాడిన పల్లె పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. 

జిమ్ జిమ్ తారా అని ఒక పాట, అత్తరు సాయిబు మంచోడమ్మా అని ఇంకో పాట.. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేశాయి. లక్ష్మి మామూలుగానే ఆ పాటలు పాడినా.. వాటిని భలేగా రీమిక్స్ చేయడంతో సోషల్ మీడియా జనాలను ఆ పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఐతే ఇందులో ‘జిమ్ జిమ్ తార’ పాటను ‘పర్ణశాల’ అనే చిన్న సినిమా కోసం కంపోజ్ చేశారని.. సినిమా నుంచి రిలీజ్ చేయడానికి ముందే అనుకోకుండా అది లీక్ అయి వైరల్ అయిందని తర్వాత తెలిసింది.

ఐతే ఈ శుక్రవారం రిలీజైన విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఈ పాటను వాడేయడం చర్చనీయాంశం అయింది. సినిమాలో ఒక చోట బ్యాగ్రౌండ్లో ఈ పాట వినిపిస్తుంది. థియేటర్లలో ఆ సన్నివేశానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ మధ్యే పాపులర్ అయిన పాటను సినిమాలో పెట్టేశారేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే ఈ సాంగ్ వాడేటపుడు ‘ఆదర్శ కుటుంబం’ టీం ‘పర్ణశాల’ మేకర్స్ నుంచి అనుమతి తీసుకోలేదట. 

ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘పర్ణశాల’ టీం ‘ఆదర్శ కుటుంబం’ మేకర్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సింగర్ లక్ష్మి.. వెంకీ అండ్ టీమ్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చింది. మా పర్మిషన్ లేకుండా, డబ్బులు ఇవ్వకుండా ఎలా ఆ పాట వాడుకుంటారు.. వెంటనే పాట తీసేయకపోతే కేసులు పెడతాం అంటూ కర్నూలు స్లాంగ్‌లో ఆమె వార్నింగ్ ఇచ్చారు. ‘ఆదర్శ కుటుంబం’ మీద చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ‘పర్ణశాల’ టీం హెచ్చరించింది.

This post was last modified on November 1, 2026 7:31 pm

Share

Recent Posts

తండ్రిపై కొడుకు విజ‌యం

ఒక సూప‌ర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వ‌చ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంత‌గా వాడుకోవ‌డానికే ప్ర‌య‌త్నిస్తాడు. న‌ట‌న‌లో తండ్రిని అనుక‌రించ‌డం.. త‌న…

3 hours ago

మోడీని బ్లాక్‌మెయిల్ చేయ‌లేను: కేంద్రంపై బాబు

కేంద్ర ప్ర‌భుత్వానికి తాము మ‌ద్ద‌తు ఇస్తున్న మాట వాస్త‌వ‌మేన‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. దీనిని అడ్డు పెట్టుకుని…

3 hours ago

జ‌గ‌న్ గురించి ఆ రాత్రి బాగా ఆలోచించా: చంద్ర‌బాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించ‌లేద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. రాజకీయంగా పోరాటమే త‌ప్ప‌.. ఎప్పుడూ ఆయ‌న…

4 hours ago

ఫెయిర్‌నెస్ క్రీమ్ వల్ల కిడ్నీ దెబ్బతిందా?

అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే…

4 hours ago

సీత చేసిన లోటు నిత్యారెడ్డితో ఔటు

రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్,…

4 hours ago

మైసా ఎంట్రీతో మరింత చిక్కుముడి

వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…

5 hours ago