రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో హేమంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
శనివారం ఉదయం పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో హేమంత్ స్కూల్‌లోకి ప్రవేశించి పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, నిందితుడు బాధిత బాలికకు బంధువుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఆమెను వేధిస్తున్న హేమంత్, తన ప్రేమను అంగీకరించలేదనే కారణంతో ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటన తర్వాత పరారైన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన బాలికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసుపత్రికి వెళ్లి బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన శస్త్రచికిత్సలు పూర్తయ్యాయని, తదుపరి 48 గంటలు కీలకమని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు. ఇప్పుడు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
This post was last modified on November 1, 2026 9:14 pm
సోషల్ మీడియా వల్ల ఎప్పుడు ఎవరు హీరోలవుతారో, జీరోలవుతారో చెప్పలేం. అనుకోకుండా పాపులారిటీ సంపాదించి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతుంటారు…
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం వుంది. అయితే బాధ్యాయుతమైన ఒక ప్రతిపక్ష నాయకుడు ఓటు…
ఎన్నో ఏళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ తమిళ సూపర్ స్టార్ సూర్య.. ఈ ఏడాది రెండు…
అనంతపురం జిల్లాలోని రాప్తాడులో పదో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యంత పాశవికంగా ఒక ఉన్మాది ఎలక్ట్రికల్ రంపం(చైన్ సా)తో…
‘రంగస్థలం’ లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో కొత్త సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. పులివెందుల నియోజకవర్గంలోని బకారాపురంలో హల్చల్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను…