Movie News

స్టార్ డైరెక్టర్… బాత్రూంలో పడి

బాలీవుడ్లో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హఠాత్తుగా చనిపోయారు. ఆయన వయసు 57 ఏళ్లే. మంచి మంచి సినిమాలు తీసిన ఆయన.. ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నారు. అనారోగ్యం కూడా ఏమీ లేదు. అలాంటిది హఠాత్తుగా చనిపోవడం బాలీవుడ్‌కు పెద్ద షాకే. ఆయన చనిపోయిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
సంజయ్ గుప్తా..శుక్రవారం రాత్రి తన ఇంట్లోని బాత్రూంలో ఈయన జారిపడగా.. శనివారం ఉదయం వరకు ఎవరూ ఈయనని గమనించలేదట.

ఉదయం కుటుంబ సభ్యులు చూస్తే ఆయన మరణించినట్లు తెలిసింది. తలకు బలమైన దెబ్బ తగలడం వల్లే సంజయ్ గుప్తా చనిపోయినట్లు ప్రముఖ దర్శకుడు అశోక్ పండిట్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాలోనూ పోస్ట్ పెట్టారు.

వయసు మళ్లిన వాళ్లు బాత్రూంలో జారి పడి చనిపోయిన ఉదంతాలు ఎన్నో వింటుంటాం. ఐతే సంజయ్‌ది మరీ పెద్ద వయసు కాదు. ఆయన కాస్త ఎక్కువ బరువుంటారు. రాత్రి నిద్ర మధ్యలో బాత్రూంకు వెళ్లి జారి పడిపోయి ఉంటారని.. నిద్రపోతున్న మిగతా కుటుంబ సభ్యులు ఉదయం వరకు గుర్తించి ఉండరని భావిస్తున్నారు. సంజయ్ గుప్తా బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లు ఇచ్చారు.

1994లో విడుదలైన ‘ఆతిష్: ఫీల్ ద ఫైర్’ సినిమాతో సంజయ్ కెరీర్ మొదలైంది. తర్వాత ‘రామ్ శాస్త్ర’, ‘జంగ్’, ‘ఖౌఫ్’ లాంటి సినిమాలు తీశారు. 2002లో విడుదలైన మల్టీస్టారర్ మూవీ ‘కాంటే’.. సంజయ్‌కి పెద్ద బ్రేకిచ్చింది. స్టార్ డైరెక్టర్ అయ్యారు. షూటౌట్ అట్ లోఖండ్‌వాలా, షూటౌట్ అట్ వాదాలా.. దస్ కహానియా లాంటి సినిమాలు సంజయ్ గుప్తాకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో దర్శకుడిగానే కాకుండా రచయిత, నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. చివరగా రెండేళ్ల క్రితం ‘ది మిరిండా బ్రదర్స్’ సినిమా తీశాడు సంజయ్.

This post was last modified on October 31, 2026 3:19 pm

Share

Recent Posts

ఇలా అయితే జ‌గ‌న్ రావ‌డం క‌ష్ట‌మే

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హారం.. మ‌రోసారి ఢిల్లీ వ‌ర‌కు చేరిందా? ఆయ‌న‌పై బీజేపీ అగ్ర‌నేత ఒక‌రు సీరియ‌స్ కామెంట్లు చేశారా?…

22 minutes ago

ఇలాంటి వాల్లని ఉరి తీయాలి

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై 26 ఏళ్ల ఉన్మాది రంపంతో దాడి…

39 minutes ago

వృషకర్మ అడ్వాన్స్ అవ్వడం మంచిదే

డిసెంబర్ 4 విడుదల కాబోతున్న వృషకర్మ ముందుగానే ప్రమోషన్ల పర్వానికి తెర తీసింది. రిలీజ్ డేట్ వరకు మధ్యలో ఉన్న…

43 minutes ago

డ్రాగన్ మ్యూజిక్‌కి దురంధరుడు తోడైతే

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ విడుదలకు రెడీ అవుతున్న సంగతి…

3 hours ago

చిట్టిబాబు బోణీ ఎలా జరిగింది

నిన్న విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 డీసెంట్ టాక్ తో మొదలై సాయంత్రం షోలకంతా మంచి పికప్ చూపించేసింది.…

3 hours ago

ఆర్‌సీ 17… ఊహించని హీరోయిన్ ?

రేపు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కాబోతున్న రామ్ చరణ్ 17 తాలూకు డీటెయిల్స్ ఇప్పటిదాకా చాలా గుట్టుగా ఉంటూ…

4 hours ago