అన్ని విషయాల్లోనూ కాకపోయినా.. కొన్ని కొన్నివిషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ చూపే చొరవ ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ సదస్సు సందర్భంగా నిర్వహించిన క్వాడ్ నేతల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. భారత జాతీయ జెండా గుర్తు ఉన్న ఫ్లోర్ మార్కర్‌ను నేలపై నుంచి తీసి తన జేబులో పెట్టుకుని ఆయన గౌరవించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఏం జరిగింది..
మనీలాలో ఆసియాన్ సదస్సుతో పాటు జరిగిన క్వాడ్ దేశాధినేతల గ్రూప్ ఫోటో సెషన్ సమయంలో ఫోటో దిగేటప్పుడు ఆయా దేశాధినేతలు ఎక్కడ నిలబడాలో సూచించడానికి నిర్వాహకులు కార్పెట్‌పై ఆయా దేశాల జెండాల గుర్తులు ఉన్న చిన్న పేపర్ మార్కర్లను ఉంచారు. ఈ క్రమంలో తన స్థానానికి వెళ్లిన మోడీ, కింద భారత త్రివర్ణ పతాకపు గుర్తు ఉన్న మార్కర్‌ను గమనించి వెంటనే కిందకు వంగి దానిని పైకి తీశారు. జాతీయ జెండా గుర్తుపై ఎవరి కాలు పడకూడదనే ఉద్దేశంతో ఆయన దానిని జాగ్రత్తగా తన జేబులో పెట్టుకున్నారు.
ఈ సమయంలో మోడీ పక్కనే ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దృశ్యాన్ని చూసి `దానిని భద్రపరుచుకోండి` అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జపాన్ ప్రధాని సనే తకైచి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా పాల్గొన్నారు. గతంలో 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కూడా ప్రధాని మోడీ ఇదే విధంగా వేదికపై ఉన్న భారత జెండా మార్కర్‌ను తీసి జేబులో పెట్టుకున్నారు. ఇలా అంతర్జాతీయ వేదికలపై జాతీయ జెండా పట్ల ప్రధాని చూపిన గౌరవంపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మోడీ దేశ భక్తిని కించపరిచేవారికి ఇదే ఉదాహరణ అంటూ.. బీజేపీ నాయకులు చురకలు అంటించారు. మొత్తంగా ఇది చిన్న విషయమే అని అనుకున్నా.. మోడీకి మాత్రం పెద్ద మార్కులే పడడం గమనార్హం.
This post was last modified on November 18, 2026 3:29 pm
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…
టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్…
కొన్ని కొన్ని ప్రకటనలు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయకులు మాత్రం ఊదరగొడుతూనే ఉంటారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత శబరిమల ఆలయాన్ని…
తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…
కేరళ రాష్ట్రానికి చెందిన నటుడు, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి తన నోటికి పని చెప్పారు. బీజేపీ…
సీనియర్ హీరో గోపీచంద్ మొదట ‘తొలి వలపు’ సినిమాతో కథానాయకుడిగానే ప్రయాణం మొదలుపెట్టాడు కానీ.. అతడికి నటుడిగా మంచి పేరొచ్చింది…