Movie News

రామ్‌చరణ్ హీరోయిన్‌గా బుట్టబొమ్మ ?

ఇటీవలే పూజా కార్యక్రమంతో మొదలైన రామ్ చరణ్ 17 ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళలేదు. డిసెంబర్ నుంచి సెట్ లో అడుగు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేయగా మిగిలిన క్యాస్టింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. అయితే అసలైన హీరోయిన్ వ్యవహారం మాత్రం ఎంతకీ తేలడం లేదని టాక్. ఆకాశంలో ఒక తార ఫేమ్ సాత్విక వీరవల్లితో పాటు దురంధర్ లో నటించిన సారా అర్జున్ పేర్లు బలంగా వినిపించాయి కానీ ఫోటో షూట్ తప్ప ఎలాంటి అప్డేట్ లేకపోయింది.

తాజాగా మరో కొత్త నేమ్ తెరమీదకు వచ్చింది. అనీఖా సురేంద్రన్ ని తీసుకునే అవకాశాలు ఉన్నట్టు మెగా కాంపౌండ్ లో వినిపిస్తున్న మాట. ఇంకా ఖరారు చేయలేదు కానీ పరిశీలన అయితే బలంగా జరుగుతోందట. విశ్వాసంలో అజిత్ కూతురిగా గుర్తింపు వచ్చాక చైల్డ్ ఆర్టిస్ట్ గా తను చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ది ఘోస్ట్ లో నాగార్జున తనయగా కనిపించినా ఫలితం దక్కలేదు. మూడేళ్ళ క్రితం సితార సంస్థ నిర్మించిన బుట్టబొమ్మ ద్వారా మెయిన్ లీడ్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది.

తర్వాత నాలుగైదు తమిళ మలయాళం సినిమాలు చేసింది కానీ ప్రయోజనం దక్కలేదు. ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మా నీకు అంత కోపమా కూడా నిరాశపరిచింది. ఇంకో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి తప్ప వేరే కమిట్ మెంట్స్ లేవు. పెర్ఫార్మన్స్ పరంగా ఆ అమ్మాయి మీద కంప్లయింట్స్ లేవు కానీ సుకుమార్ డిజైన్ చేసిన పాత్రకు ఏ మేరకు సరిపోతుందనేది ఇప్పుడే చెప్పలేం. రంగస్థలం టైంలో కూడా అనుపమ పరమేశ్వరన్ ని దాదాపు ఓకే అనుకుని ఫైనల్ గా సమంతని లాక్ చేయడం తెలిసిందే.

సో ఇప్పటికిప్పుడు ఆర్సి 17లో ఎవరు ఎంపిక అవుతారనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. అంత ఈజీగా తేలేలా కూడా కనిపించడం లేదు. రాజీ పడటం అసలు అలవాటు లేని సుకుమార్ ఇన్ని నెలలు రకరకాల ఆప్షన్లు ఎందుకు ఆలోచించలేదన్నది అంతు చిక్కని ప్రశ్న. ఈ ప్యాన్ ఇండియా మూవీ ఎప్పుడు స్టార్ట్ అయినా 2027లో వచ్చే అవకాశం అయితే లేదు. ఆపై ఏడాది సంక్రాంతికి వస్తే లక్ అనుకోవాలి. లేదంటే మటుకు ఈసారి కూడా చరణ్ అభిమానులకు లాంగ్ వెయిటింగ్ తప్పదు.. 

This post was last modified on November 18, 2026 1:49 pm

Share

Recent Posts

గేమింగ్ పిచ్చి పీక్స్.. GTA 6 ఆడేందుకు పెళ్ళాంతోనే డీల్

వీడియో గేమ్స్ అంటే యువతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన గేమ్ కోసం గంటల…

8 minutes ago

ఛార్జిషీట్ నంబర్ పదికి చేరింది జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మరో ఛార్జిషీట్ దాఖలైంది. జగన్ అక్రమాస్తుల కేసును…

12 minutes ago

రామాయణ మేనియా.. థియేటర్లలో నాన్‌వెజ్‌కు బ్రేక్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…

2 hours ago

బండ్ల గణేష్ కు జైలు శిక్ష

టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్…

3 hours ago

‘శ‌బ‌రిమ‌ల‌ను తిరుమ‌ల చేస్తా’: సీఎం ప్ర‌క‌ట‌న.. సాధ్య‌మేనా?!

కొన్ని కొన్ని ప్ర‌క‌ట‌న‌లు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయ‌కులు మాత్రం ఊద‌ర‌గొడుతూనే ఉంటారు. తాజాగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని…

4 hours ago

లక్కీగా రేవంత్ సీఎం అయ్యారు: రాజగోపాల్ రెడ్డి

తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…

5 hours ago