సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. నటుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ చిత్రంతో అతను తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించాడు. ఆ తర్వాత క్వాలిటీ విషయంలో కొంచెం కాంప్రమైజ్ కావడంతో తన సినిమాలు సరిగా ఆడలేదు. అయినా అతను గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ప్రీతి అస్రానితో కలిసి తరుణ్ ‘అప్పా కుట్టి’ అనే సినిమాలో నటించాడు. ఈ నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా ఆడియో వేడుకలో విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా అంటోనీ తన భర్త గురించి ఒక హార్ట్ టచింగ్ విషయం చెప్పింది. విజయ్ కొన్నేళ్ల నుంచి చెప్పులే ధరించడం లేదు. ఎక్కడికి వచ్చినా వట్టి కాళ్లతోనే వస్తున్నాడు. ఇందుకు తన కూతురి మరణమే కారణమని ఫాతిమా వెల్లడించారు.
విజయ్, ఫాతిమాల తనయురాలు మీరా మూడేళ్ల ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం పెద్ద షాక్. ఆమె మరణం తర్వాతే విజయ్ చెప్పులు వేసుకోవడం మానేశాడట. తమ కుమార్తె ఉపయోగించిన వస్తువులు అన్నీ తన గదిలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని, ఐతే అందులో మీరా కోసం కొని, ఉపయోగించకుండా ఉండిపోయిన చెప్పులను చూసి విజయ్ ఇకపై జీవితంలో చెప్పులు ధరించకూడదని నిర్ణయించుకున్నాడని ఫాతిమా తెలిపారు.
ఇక విజయ్‌కి గతంలో ఒక ఖరీదైన గడియారం ఉండేదని, కానీ దాన్ని పక్కన పెట్టి మీరా కొనిచ్చిన 4 వేల రూపాయల వాచ్ మాత్రమే ధరిస్తున్నాడని ఫాతిమా చెప్పారు. ‘అప్పాకుట్టి’ ఒక తండ్రి, కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా కావడంతో విజయ్ ఆంటోనీ, ఫాతిమా దీని విషయంలో చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే మీరా గురించి ఇలా ఆడియో వేడుకలో మాట్లాడుతూ ఫాతిమా ఎమోషనల్ అయ్యారు. విజయ్, ఫాతిమాలకు ఇంకో కూతురు ఉంది. తన పేరు.. లారా.
This post was last modified on November 18, 2026 2:39 pm
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…
టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్…
కొన్ని కొన్ని ప్రకటనలు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయకులు మాత్రం ఊదరగొడుతూనే ఉంటారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత శబరిమల ఆలయాన్ని…
తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…
అన్ని విషయాల్లోనూ కాకపోయినా.. కొన్ని కొన్నివిషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ చూపే చొరవ ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఫిలిప్పీన్స్ రాజధాని…
కేరళ రాష్ట్రానికి చెందిన నటుడు, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి తన నోటికి పని చెప్పారు. బీజేపీ…