సీనియర్ హీరో గోపీచంద్ మొదట ‘తొలి వలపు’ సినిమాతో కథానాయకుడిగానే ప్రయాణం మొదలుపెట్టాడు కానీ.. అతడికి నటుడిగా మంచి పేరొచ్చింది విలన్ పాత్రలతోనే జయం, వర్షం, నిజం చిత్రాల్లో ప్రతినాయకుడిగా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఆ టైంలోనే ‘యజ్ఞం’ సినిమాతో హీరోగానూ విజయాన్నందుకోవడంతో అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అప్పట్నుంచి హీరో పాత్రలకే పరిమితం అయిన గోపీచంద్.. మళ్లీ విలన్ పాత్రల వైపు చూడలేదు.
ఐతే ఇప్పుడు గోపీచంద్ మళ్లీ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు ఒక వార్త హల్చల్ చేస్తోంది. అది కూడా తమిళ స్టార్ హీరో సూర్యను గోపీచంద్ ఢీకొట్టబోతున్నాడని ప్రచారం అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఇదెంత వరకు నిజమో కానీ.. నిజంగా ఈ కాంబినేషన్ నిజం అయితే మాత్రం సినిమాకు వచ్చే హైప్ వేరే లెవెల్లో ఉంటుందనడంలో సందేహం లేదు.
ఈ ఏడాది కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్, సీన్ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న సూర్య.. ప్రస్తుతం ‘జై భీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో ఒక సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత సూర్య రెండు సినిమాలు కమిటయ్యాడు. అందులో ఒకటి ‘డీసీ’ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో నటించబోయేది. ఈ చిత్రంలోనే గోపీచంద్ విలన్ పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సూర్య సినిమా అంటే సౌత్ ఇండియా అంతటా భారీ స్థాయిలో రిలీజవుతుంది. అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉంటుంది. ఇలాంటి సినిమాలో విలన్ పాత్ర చేస్తే గోపీచంద్‌కు కూడా మంచి రీచ్ రావడం ఖాయం. హీరోగా అతను చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ‘భరత వర్ష’తో పాటు ‘సింగా’ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. సూర్య సినిమాలో మలయాళ హీరోయిన్ రియా షిబు (సర్వం మాయ) ఫేమ్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరి సూర్య, గోపీచంద్ కాంబో గురించి వస్తున్న వార్తలు ఎంత వరకు నిజమన్నది చూడాలి.
This post was last modified on November 18, 2026 2:56 pm
వీడియో గేమ్స్ అంటే యువతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన గేమ్ కోసం గంటల…
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మరో ఛార్జిషీట్ దాఖలైంది. జగన్ అక్రమాస్తుల కేసును…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…
టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్…
కొన్ని కొన్ని ప్రకటనలు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయకులు మాత్రం ఊదరగొడుతూనే ఉంటారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత శబరిమల ఆలయాన్ని…
తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…