Movie News

తెరపై హింసకు అడ్డుకట్ట వేయాల్సిందే

గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత తెరమీద వయొలెన్స్ వికృత రూపాలు దాల్చింది. హత్యలు ఎంత దారుణంగా చేయొచ్చో చాలా డీటెయిల్డ్ గా చూపిస్తున్నారు. సైకో థ్రిల్లర్ల పేరుతో తమ మానసిక దౌర్భల్యాన్ని డబ్బు చేసుకుంటున్న దర్శకులు లెక్కలేనంత ఉన్నారు. ఇది కేవలం స్మార్ట్ స్క్రీన్ కే పరిమితం కాలేదు. టికెట్లు కొని థియేటర్ లో వీక్షించే సినిమాల్లో వందల్లో తలలు తెగి పడుతున్నాయి. రక్తం ఏరులై పారుతోంది. ఒళ్ళు జలదరించేలా, అసహ్యం వేసేలా మర్డర్లను చాలా తేలికగా ప్రెజెంట్ చేస్తున్నారు.

అడిగితే సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని దర్శక నిర్మాతలు కవర్ చేసుకుంటున్నారు. పిల్లల్ని చూడొద్దని ముందే చెప్పామని తప్పుని పక్కకు తోస్తున్నారు. ఇంకో వైపు ప్రేమకథల పేరుతో సందేశం ఇస్తున్నట్టుగా స్టేజి మీద హడావిడి చేస్తున్న మరికొందరు మేకర్స్ టెన్త్, ఇంటర్ పిల్లల మధ్య ప్రేమను ఇప్పుడు ఏకంగా సెక్స్ దాకా తీసుకెళ్లిపోయారు. అడిగితే సమాజంలో ఉన్నదే చూపిస్తున్నాం, క్లైమాక్స్ లో మీరే కంటతడి పెట్టుకుంటారని నీతి కబుర్లు చెప్పి, సినిమా మొదటి రెండు గంటల పాటు విచ్చలవిడితనాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

సినిమాని సినిమాలా చూడాలి , వాటిని చూసి ఎవరు ప్రభావితం చెందరని ఎవరైనా వాదించవచ్చు. కానీ నిజాలు చేదుగా ఉంటాయి. ముఖ్యంగా లేత మనసుల మీద ఖచ్చితంగా వీటి ప్రభావం ఉంటుంది. శివ టైంలో వీధుల్లో సైకిల్ చైన్లు పట్టుకుని తిరిగిన వాళ్ళున్నారు. ఫ్యాక్షన్ చిత్రాలు రాజ్యమేలిన టైంలో గ్రామాల్లో హింస పెరిగిందని అప్పట్లో కొన్ని కథనాలు వచ్చాయి. మనుషులను చంపి ఫ్రిడ్జ్ లో పెట్టడం, ముక్కలు చేసి ఊరవతల పారేయడం, కుక్కర్లో ఉడికించడం ఇవన్నీ గత మూడు నాలుగు సంవత్సరాల్లో వచ్చిన వెబ్ సిరీస్ లో చూసిన మచ్చుతునకలు. కొందరు ఇవి చూసి స్ఫూర్తి చెందామని ఒప్పుకున్నారు కూడా.

ఇకపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వ్యాపారం, కల్ట్ ఫిలిం మేకింగ్ పేరుతో దర్శక రచయతలు చూపిస్తున్న పైత్యానికి జనం అడ్డుకట్ట వేయలేరు. గవర్నమెంట్, సెన్సార్ మాత్రమే చేయగలదు. ఆంక్షలు మరింత కఠినంగా మారాలి. కోట్లు ఖర్చు పెట్టారని ఇలాంటి కంటెంట్లను ప్రోత్సహిస్తే కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రాలేని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఎంత కథ ప్రకారమే అయినా, చదువుకుంటున్న హీరో క్లాసులోకి తుపాకీ తీసుకొచ్చి బెదిరించినప్పుడు చప్పట్లు కొట్టిన జనాల మీద సినిమాల ప్రభావం లేదంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉన్నట్టే.

This post was last modified on October 31, 2026 5:44 pm

Share

Recent Posts

స్టార్ డైరెక్టర్… బాత్రూంలో పడి

బాలీవుడ్లో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హఠాత్తుగా చనిపోయారు. ఆయన వయసు 57 ఏళ్లే.…

2 hours ago

ఇలా అయితే జ‌గ‌న్ రావ‌డం క‌ష్ట‌మే

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హారం.. మ‌రోసారి ఢిల్లీ వ‌ర‌కు చేరిందా? ఆయ‌న‌పై బీజేపీ అగ్ర‌నేత ఒక‌రు సీరియ‌స్ కామెంట్లు చేశారా?…

2 hours ago

ఇలాంటి వాల్లని ఉరి తీయాలి

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై 26 ఏళ్ల ఉన్మాది రంపంతో దాడి…

3 hours ago

వృషకర్మ అడ్వాన్స్ అవ్వడం మంచిదే

డిసెంబర్ 4 విడుదల కాబోతున్న వృషకర్మ ముందుగానే ప్రమోషన్ల పర్వానికి తెర తీసింది. రిలీజ్ డేట్ వరకు మధ్యలో ఉన్న…

3 hours ago

డ్రాగన్ మ్యూజిక్‌కి దురంధరుడు తోడైతే

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ విడుదలకు రెడీ అవుతున్న సంగతి…

5 hours ago

చిట్టిబాబు బోణీ ఎలా జరిగింది

నిన్న విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 డీసెంట్ టాక్ తో మొదలై సాయంత్రం షోలకంతా మంచి పికప్ చూపించేసింది.…

5 hours ago