Political News

‘శ‌బ‌రిమ‌ల‌ను తిరుమ‌ల చేస్తా’: సీఎం ప్ర‌క‌ట‌న.. సాధ్య‌మేనా?!

కొన్ని కొన్ని ప్ర‌క‌ట‌న‌లు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయ‌కులు మాత్రం ఊద‌ర‌గొడుతూనే ఉంటారు. తాజాగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని తిరుమ‌ల త‌ర‌హాలో భారీగా అభివృద్ధి చేస్తామ‌ని.. కొత్త ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ వి.డి. సతీశన్ చేసిన ప్రకటన కూడా ఈ జాబితాలోకే వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. శ‌బ‌రిమ‌ల వేరు.. తిరుమ‌ల వేరు. తిరుమ‌ల జ‌నాల మ‌ధ్య ఉంటే.. శ‌బ‌రిమ‌ల అడ‌వుల్లో.. లోయ‌ల్లో ఉంద‌ని చెబుతున్నారు. మౌలిక సదుపాయాలు, భక్తుల రద్దీ నియంత్రణ పరంగా తిరుమల లాగా శ‌బ‌రిమ‌ల‌ను మార్చడం సాధ్యం కాదని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.

ఇదీ తేడా..

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తరహాలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు నిలక్కల్ వద్ద 6,000 మంది పట్టేలా భారీ షెడ్లు, ఆధునిక క్యూ కాంప్లెక్స్‌లు నిర్మించవచ్చన‌ని సీఎం స‌తీశ‌న్ చెబుతున్నారు. కానీ, ఇది సాధ్యం కాద‌ని గ‌తంలోనే అధికారులు తేల్చేశారు. ఇక‌, డిజిటల్, ఏఐ AI సాంకేతికతతో తిరుపతి మోడల్‌లో భాగంగా ఆన్‌లైన్ దర్శన టికెట్లు, 21 ప్రాంతాల్లో ఏఐ ఆధారిత పార్కింగ్ నిర్వహణ, నిఘా కెమెరాల ఏర్పాటు చేస్తామ‌ని అంటున్నారు. ఇది సాధ్య‌మే అయినా.. ఏడాదికి కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే తెరిచే అయ్య‌ప్ప ఆల‌యానికి ఇవ‌న్నీ భారం కానున్నాయ‌న్న వాద‌నా ఉంది.

ఇప్పటికే కొచ్చి విమానాశ్రయంలో యాత్రికుల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుండి నేరుగా బస్సులు, హెలికాప్టర్ సేవలు, శబరిమల విమానాశ్రయం ద్వారా రవాణాను మెరుగుపరచడం సాధ్యమే అయినా.. ఖ‌ర్చుతో కూడింది కావ‌డం.. పైగా భ‌క్తుల పాద‌యాత్ర సెంటిమెంటుతో గ‌త ప్ర‌భుత్వాలే దీనిపై వెన‌క్కి త‌గ్గాయి. శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు కేరళలోని ఇతర ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించేలా ఒక అనుసంధాన పర్యాటక వ్యవస్థను రూపొందించవచ్చని గ‌తంలో తీర్మానంచేసినా.. ఇది కూడా ముందుకు క‌ద‌ల్లేదు.

ఇక‌, స‌వాళ్లు అనేకం..

తిరుమల కొండపైకి నేరుగా వాహనాలు వెళ్లేలా ఘాట్ రోడ్లు, భారీ భవనాలు ఉన్నాయి. కానీ శబరిమల ఆలయం పెరియార్ టైగర్ రిజర్వ్ అభయారణ్యం పరిధిలో ఉంది. కేంద్ర పర్యావరణ శాఖ, సుప్రీంకోర్టు ఆంక్షల కారణంగా అక్కడ విచ్చలవిడిగా శాశ్వత నిర్మాణాలు, రోడ్లు వేయడం సాధ్యం కాదు. ఇక‌, శ‌బ‌రిమ‌ల ఆలయ సంప్రదాయాలు కూడా భిన్నంగా ఉంటాయి. తిరుమల ఆలయం ఏడాది పొడవునా నిత్యం తెరిచి ఉంటుంది.

శబరిమల ఆలయం కేవలం మండల-మకరవిళక్కు సీజన్‌, ప్రతి మలయాళ మాసంలో కొన్ని రోజులు మాత్రమే తెరుస్తారు. పంబ నుండి సన్నిధానం వరకు భక్తులు కాలినడకన కొండ ఎక్కడం శబరిమల యాత్రలో ప్రధాన భాగం. తిరుమల తరహాలో నేరుగా గుడి దగ్గరికే వాహనాలను అనుమతించడం ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, ఆచారాల దృష్ట్యా కుదరదు. సో.. ఎలా చూసుకున్నా.. సీఎం ప్ర‌క‌ట‌న కేవ‌లం ప్ర‌క‌ట‌నేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 18, 2026 3:09 pm

Share

Recent Posts

గేమింగ్ పిచ్చి పీక్స్.. GTA 6 ఆడేందుకు పెళ్ళాంతోనే డీల్

వీడియో గేమ్స్ అంటే యువతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన గేమ్ కోసం గంటల…

21 minutes ago

ఛార్జిషీట్ నంబర్ పదికి చేరింది జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మరో ఛార్జిషీట్ దాఖలైంది. జగన్ అక్రమాస్తుల కేసును…

25 minutes ago

రామాయణ మేనియా.. థియేటర్లలో నాన్‌వెజ్‌కు బ్రేక్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…

2 hours ago

బండ్ల గణేష్ కు జైలు శిక్ష

టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్…

3 hours ago

లక్కీగా రేవంత్ సీఎం అయ్యారు: రాజగోపాల్ రెడ్డి

తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…

6 hours ago

ఈ విష‌యంలో మోడీని మెచ్చేసుకున్నారు!

అన్ని విష‌యాల్లోనూ కాక‌పోయినా.. కొన్ని కొన్నివిష‌యాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చూపే చొర‌వ ప్ర‌శంస‌లు అందుకుంటోంది. తాజాగా ఫిలిప్పీన్స్ రాజ‌ధాని…

6 hours ago