Political News

ఇలా అయితే జ‌గ‌న్ రావ‌డం క‌ష్ట‌మే

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హారం.. మ‌రోసారి ఢిల్లీ వ‌ర‌కు చేరిందా? ఆయ‌న‌పై బీజేపీ అగ్ర‌నేత ఒక‌రు సీరియ‌స్ కామెంట్లు చేశారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ సీనియ‌ర్ నేత‌లు. కుటుంబ వివాదాలు ఎప్పుడూ రాజ‌కీయాల‌ను శాసిస్తుంటాయి. గ‌త 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ ఈ వ్య‌వ‌హారం తెలిసి వ‌చ్చింది. త‌న సోద‌రి ష‌ర్మిల‌.. రెండు అంశాల‌తో అప్ప‌ట్లో జ‌గ‌న్‌పై పోరాటం చేశారు. ఆస్తులు, వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య ఉదంతాలను ఆమె ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లారు.

ఫ‌లితంగా 151 సీట్ల నుంచి వైసీపీ 11 స్థానాల‌కు ప‌డిపోయింది. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన స్థానిక ఎన్నిక‌ల వేళ‌.. ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్ వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ష‌ర్మిల కుమార్తె అంజ‌లి వివాహానికి బెంగ‌ళూరులోని య‌ల‌హంక లో ఉన్న ఇంటిని ఇచ్చేందుకు జ‌గ‌న్ స‌సేమిరా అన‌డం.. కొన్ని మీడియాల్లో ఇది సీరియ‌ల్‌గా రావ‌డంతో ప్ర‌జ‌ల మ‌ధ్య విస్తృత‌మైన చ‌ర్చ‌కు దారితీసింది. జ‌గ‌న్‌.. త‌న కుటుంబం విష‌యంలోనూ ముఖ్యంగా త‌న సోద‌రి ష‌ర్మిల విష‌యంలోనూ అన్యాయం చేస్తున్నార‌న్న‌.. వాద‌న ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది.

ఈ వ్య‌వ‌హారాన్ని తాజాగా బీజేపీ, టీడీపీనేత‌లు.. కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. బీజేపీ అగ్ర‌నేత‌తో చ‌ర్చించిన సంద‌ర్భంగా జ‌గ‌న్ ప‌రిస్థితిని ఆయ‌న ఆరా తీసిన‌ప్పుడు.. ష‌ర్మిల‌కు జ‌గ‌న్ ఇల్లు ఇవ్వ‌న‌న్నార‌న్న విష‌యాన్ని వారు ప్ర‌స్తావించారు. దీనికి సంబంధించి మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌ను కూడా ఆయ‌న వినిపించారని తెలిసింది. దీనిపై సీరియ‌స్‌గా రియాక్ట్ అయిన స‌ద‌రు నేత‌.. కుటుంబ వ్య‌వ‌హారాల‌ను ర‌చ్చ చేసుకున్న ఏ నేత కూడా రాజ‌కీయాల్లో పైకి వ‌చ్చిన సంద‌ర్భాలు లేవ‌ని వ్యాఖ్యానించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో మ‌రో ప్ర‌త్యామ్నాయంగా ఉన్న జ‌గ‌న్‌.. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా త‌నే గెలుస్తాన‌ని చెబుతున్నారు. కానీ, తాజా ప‌రిణామాల త‌ర్వాత‌.. ఆయ‌న వ్య‌క్తిగ‌త గ్రాఫ్ కూడా భారీగా ప‌డిపోయింద‌ని టీడీపీ, బీజేపీలు అంచ‌నా వేస్తున్నాయి. ఇదే విష‌యాన్ని బీజేపీ అగ్ర‌నేత‌కు కూడా వివ‌రించారని తెలిసింది. కేంద్రంలో కీల‌క ప‌ద‌విలో ఉన్న స‌ద‌రు నేత‌.. జ‌గ‌న్ గురించి మాట్లాడుతూ.. ఇక , ఇప్ప‌ట్లో జ‌గ‌న్ కోలుకునేది లేద‌ని.. కూట‌మికి తిరుగులేద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు నేత‌లు చెబుతున్నారు. అయితే.. కూట‌మి స‌ఖ్య‌త మ‌రింత పెర‌గాల‌ని మాత్రం ఆయ‌న సూచించిన‌ట్టు తెలిపారు.

This post was last modified on October 31, 2026 3:17 pm

Share

Recent Posts

స్టార్ డైరెక్టర్… బాత్రూంలో పడి

బాలీవుడ్లో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హఠాత్తుగా చనిపోయారు. ఆయన వయసు 57 ఏళ్లే.…

28 minutes ago

ఇలాంటి వాల్లని ఉరి తీయాలి

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై 26 ఏళ్ల ఉన్మాది రంపంతో దాడి…

47 minutes ago

వృషకర్మ అడ్వాన్స్ అవ్వడం మంచిదే

డిసెంబర్ 4 విడుదల కాబోతున్న వృషకర్మ ముందుగానే ప్రమోషన్ల పర్వానికి తెర తీసింది. రిలీజ్ డేట్ వరకు మధ్యలో ఉన్న…

50 minutes ago

డ్రాగన్ మ్యూజిక్‌కి దురంధరుడు తోడైతే

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ విడుదలకు రెడీ అవుతున్న సంగతి…

3 hours ago

చిట్టిబాబు బోణీ ఎలా జరిగింది

నిన్న విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 డీసెంట్ టాక్ తో మొదలై సాయంత్రం షోలకంతా మంచి పికప్ చూపించేసింది.…

3 hours ago

ఆర్‌సీ 17… ఊహించని హీరోయిన్ ?

రేపు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కాబోతున్న రామ్ చరణ్ 17 తాలూకు డీటెయిల్స్ ఇప్పటిదాకా చాలా గుట్టుగా ఉంటూ…

4 hours ago