దీపావళికి విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి రామాయణ పార్ట్ 1, సూర్య సీన్ మీద ఉంది కానీ నయనతార మహాశక్తి కూడా జనాల దృష్టిలో పడేందుకు మంచి మార్కెటింగ్ ప్లాన్లు వేస్తోంది. తమిళంలో మూకుతి అమ్మన్ 2గా రూపొందుతున్న ఈ డివోషనల్ ఫాంటసీ డ్రామాలో నయనతార టైటిల్ రోల్ పోషించగా వీరసింహారెడ్డి ఫేమ్ దునియా విజయ్ తో పాటు రెజీనా కసెండ్రా విలన్లుగా నటించారు. ట్రైలర్ లో ఏఐ ఎక్కువ వాడారంటూ సోషల్ మీడియా కామెంట్స్ గట్టిగానే వచ్చాయి.
అయితే ఇంత కాంపిటీషన్ మీద మహాశక్తిని రేసులో దింపడం చూస్తుంటే నిర్మాతల కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు సి సుందర్ ఈ సినిమా మీద ఫోకస్ పెట్టడం కోసమే కమల్ హాసన్ – రజనీకాంత్ మల్టీస్టారర్ వదులుకున్నారనే టాక్ ఆ మధ్య చెన్నై మీడియాలో చక్కర్లు కొట్టింది. విచిత్రంగా కోలీవుడ్ బయ్యర్లు సీన్ కంటే ఎక్కువగా మహాశక్తి వైపే మొగ్గు చూపుతున్నారట. పండక్కు ఇది వర్కౌట్ అవుతుందని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారని ఆశిస్తున్నారు.
తెలుగులో ఆ స్థాయి బజ్ కష్టమే కానీ మన దగ్గర మౌత్ టాక్ కీలకం కానుంది. ఎందుకంటే రామాయణకు ఏపీ తెలంగాణలో గ్రాండ్ రిలీజ్ దక్కుతోంది. హ్యాట్రిక్ టార్గెట్ చేసుకున్న సూర్యకు టాలీవుడ్ యువత ఎలాగూ అండగా ఉంటుంది. ఆదర్శ కుటుంబంకి వెంకటేష్ ఇమేజ్, త్రివిక్రమ్ బ్రాండ్ రక్షణ కవచంలా ఉంటాయి కాబట్టి రెండో వారంలోనూ డీసెంట్ ఆక్యుపెన్సీలు ఉండొచ్చు. వీటి మధ్య మహాశక్తి నెగ్గుకు రావాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కువ ప్రమోషన్లు లేకుండానే.
ఒకవేళ నయనతార హిట్టు కొడితే మాత్రం సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. మొదటిభాగంతో ఏ మాత్రం సంబంధం ఉండదని, పూర్తిగా కొత్త కథ తీసుకుని ఇది తీశామని మేకర్స్ చెబుతున్నారు. ధృవ ఫేమ్ హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ లేరు. ప్రపంచ వినాశనానికి పూనుకున్న ఒక మంత్రగత్తె ఆట కట్టించడానికి అమ్మోరు తల్లి భూమి మీదకు వచ్చే కథతో సుందర్ దీన్ని తెరకెక్కించారు. జర్నలిస్ట్, దేవతగా నయనతార ఇందులో డ్యూయల్ రోల్ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates