వారణాసి విడుదల మీద కొత్త ప్రచారాలు మొదలైపోయాయి. ఏప్రిల్ 7 విడుదల సాధ్యం కాదని, అందుకే మగధీర వచ్చిన జూలై 31 వెళ్లే ఆలోచనలో రాజమౌళి బృందం సీరియస్ గా ఉందని వస్తున్న వార్తలు మహేష్ బాబు అభిమానులకు టెన్షన్ కలిగిస్తున్నాయి. ఈసారి పోస్ట్ పోన్ ఉండదనే తరహాలో సోషల్ మీడియా వేదికగా జక్కన్న టీమ్ ఎప్పటికప్పుడు హామీ ఇస్తున్నప్పటికీ బయట జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలు రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ జాడ లేకపోవడం దీనికి ప్రధాన కారణం.
ఏప్రిల్ నెలలో పిల్లల పరీక్షలు, ఐపీఎల్ సీజన్, కేవలం వారం ముందు వచ్చే గాడ్జిల్లా వర్సెస్ కింగ్ సూపర్ నోవా విడుదల లాంటి పరిణామాలు వారణాసి ఓపెనింగ్స్ ని రిస్క్ లో పడేసే ప్రమాదం లేకపోలేదు. ఎంత హైప్ ఉన్నా సరే పరిస్థితులను, పోటీని మరీ తక్కువంచనా వేయడానికి లేదు. పైగా వారణాసి మీద ఇంటర్నేషనల్ స్టూడియోలు కన్నేశాయి. ఓటిటి డీల్ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. థియేటర్ బిజినెస్ హెవీగా జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత సోలోగా రావాలి.
ఇవన్నీ విశ్లేషించుకుని చూస్తే వారణాసి జూలై లేదా అటుపై దసరా దీపావళి లాంటి టైంలో వస్తే బాగుంటుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా చరిత్ర గతంలో ఎన్నడూ చూడని వసూళ్ల విధ్వంసం ఖచ్చితంగా జరుగుతుంది. టాక్ బాగా వస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. కాకపోతే రిలీజ్ స్లాట్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఉండాలి. ఇదంతా చూసుకునే రాజమౌళి ఏప్రిల్ 7 లాక్ చేసుకున్నారు కానీ ఇప్పుడా డెడ్ లైన్ మీటవ్వగలరా అనేదే అసలు ప్రశ్న.
ఇలాంటి చర్చలు మరిన్ని జరగకముందే రాజమౌళి వైపు నుంచి క్లారిటీ వచ్చేస్తే బెటర్. ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ విజువల్ గ్రాండియర్ కు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల రీ రికార్డింగ్ ఉండొచ్చట. ఆయన కొడుకు కాల భైరవ పెళ్లి జరగనుండటంతో ఆ పనులు పర్యవేక్షిస్తూనే వారణాసి వర్క్స్ లో ఆలస్యం లేకుండా ప్లాన్ చేసుకొవాలి. ముందు చెప్పిన టైంకి వచ్చినా రాకపోయినా రాజమౌళి త్వరగా అనుమానాలు తొలగించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates