ఇంకా విడుదల తేడా రాకుండానే, స్ట్రీమింగ్ జరగకుండానే చిరంజీవి టాక్ షో ‘మెగా వర్స్’ అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే బ్రహ్మానందం – సునీల్ – సత్య ఎపిసోడ్ పూర్తయ్యింది. తాజాగా కమల్ హాసన్ భాగం షూట్ చేశారు. మరికొందరు క్రేజీ సెలబ్రిటీస్ తో లిస్టు రెడీ అవుతోంది. అయితే మెగా ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇచ్చే కాంబినేషన్ అతి త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఒకేసారి మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ షోకు స్పెషల్ గెస్టులుగా రాబోతున్నారు.
ఇంకో వారం లోపే దీని చిత్రీకరణ ఉండొచ్చని టాక్. ఈ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం అంటే మగధీర టైంలో ప్రతి ఈవెంట్ లో కలుసుకునేవాళ్ళు కానీ, తర్వాత ఎవరికి వారు బిజీ అయిపోవడంతో ఈ త్రిమూర్తులను ఒకేసారి చూడలేకపోతున్నామని ఫ్యాన్స్ ఫీలయ్యేవాళ్ళు. ఆ కోరిక ఇప్పటికి తీరుతోందన్న మాట. నవంబర్ మూడో వారం నుంచి రాబోతున్న ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ ఎవరిదనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
మెగా మల్టీస్టారర్ ఆషామాషీగా ఉండదు. తమ్ముడు, కొడుకుతో ఒకేసారి చిరు పంచుకోబోయే ముచ్చట్లు ఎలా ఉంటాయోననే ఆసక్తి మూవీ లవర్స్ లోనూ అధికంగా ఉంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇద్దరూ మహా సిగ్గరిలు. బయట ఎలా ఉన్నా ఇలాంటి చోట మాత్రం మొహమాటంతో పిల్లి మొగ్గలు వేస్తారు. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఆల్రెడీ ఇది అనుభవమే. ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలి బాస్ తోనే ఇంటరాక్షన్ అంటే అంచనాలు కూడా దానికి తగ్గట్టే భారీగా ఉంటాయి.
ఇప్పటికైతే ఇంతకు మించి అప్డేట్స్ లేవు. ప్రస్తుతం పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ డేట్ ని బట్టి ముహూర్తం ఫిక్స్ అవుతుంది. నవంబర్ 1 చరణ్ 17 ఓపెనింగ్ ఉంది కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా ఫిక్స్ చేయొచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే విశ్వంభర, కాకాలో ఏది ముందు రిలీజవుతుందనే సస్పెన్స్ ఇంకా తొలగలేదు. పెద్ది తర్వాత గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ వచ్చే వారం సుకుమార్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఓజి 2కి పవన్ డేట్స్ ఇవ్వడం ఇంకా ఖరారు కాలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates