ఒకప్పుడు గ్యాప్ లేకుండా వరుస రిలీజ్‌లతో వార్తల్లో నిలుస్తుండేవాడు నారా రోహిత్. ఒక టైంలో ఒకేసారి తన సినిమాలు తొమ్మిది వివిధ దశల్లో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఐతే తన పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు మాత్రమే రోహిత్ లైమ్ లైట్లో ఉంటాడు.. ఆయన ప్రతిపక్షానికి పరిమితం అయినపుడు తనకు సినిమాలు ఉండవు అనే మాటను నిజం చేస్తూ 2019-24 మధ్య అతను పెద్దగా సినిమాలు చేసింది లేదు.
ఐతే 2024లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక మళ్లీ కొంచెం జోష్ కనిపించింది కానీ.. ఒకప్పటి స్థాయిలో అయితే ఇబ్బడిముబ్బడిగా సినిమాలేమీ చేయట్లేదు రోహిత్. గత ఏడాది ‘భైరవం’, ‘సుందరకాండ’ చిత్రాలతో పలకరించిన అతను.. ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమాను మొదలుపెట్టాడు. అది చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈలోపు ‘ఆదర్శ కుటుంబం’ లాంటి పెద్ద సినిమాలో కీలక పాత్ర పోషించాడు రోహిత్.
ఐతే ఈ సినిమాలో రోహిత్ మీద ప్రోమోల్లాంటివేవీ కట్ చేయలేదు. ఇటీవల లాంచ్ చేసిన ట్రైలర్లో మాత్రం తన మీద ఒకట్రెండు షాట్స్ పెట్టారు తప్ప రోహిత్ పెద్దగా హైలైట్ అవ్వలేదు. ఇక నిన్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగ్గా అందులో రోహిత్ పాల్గొనలేదు. అంతే కాక దర్శకుడు త్రివిక్రమ్, హీరో వెంకటేష్ సహా ఎవ్వరూ తన ప్రస్తావన తీసుకురాలేదు.
కావాలని తన పాత్రను అండర్ ప్లే చేస్తున్నారా.. లేక అతణ్ని టీం పట్టించుకోవట్లేదా అన్నది అర్థం కావడం లేదు. రోహిత్ కూడా మొన్న ట్రైలర్ లాంచ్ అయినపుడు మొక్కుబడిగా ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టి ఊరుకున్నాడు తప్ప ఆ సినిమా గురించి, అందులో తన పాత్ర గురించి ఏ కామెంట్ చేయలేదు. మరి సినిమాలో రోహిత్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం ఉంటుంది.. తనను ఎంత వరకు హైలైట్ చేస్తారు అన్నది చూడాలి.
This post was last modified on October 29, 2026 12:00 am
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమాతో సంచలనం రేపాడు యువ నటుడు మౌళి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన…
తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల కిందట్నుంచే చెబుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ఆ సినిమా…
ఔను... పులివెందులలో జగన్ కు కొత్త సినిమా చూపిస్తామంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలు…
తెలంగాణలో పోటీ చేసి తీరుతామని ప్రకటించిన జనసేన.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టిందా? రంగంలోకి దిగేందుకురెడీ అయిందా? అంటే…
ఒకే ఏడాదిలో మూడు థియేటర్ రిలీజులిస్తున్న స్టార్ హీరోగా సూర్య 2026లో పెద్ద ఘనతనే అందుకోబోతున్నాడు. కరుప్పు / వీరభద్రుడుతో…
ఇంకొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 లో సీతగా నటించిన సాయిపల్లవి మీద చాలా కళ్లున్నాయి. తను…