Movie News

రామాయణ ప్రీమియర్ టాక్ ఏమంటున్నారు

ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మొదటి వరల్డ్ ప్రీమియర్ భారత కాలమాన ప్రకారం ఇవాళ ఉదయం జరిగింది. లాస్ ఏంజిల్స్ లో ఉన్న అతి పెద్ద డేవిడ్ గఫెన్ థియేటర్ లో తొమ్మిది వందలకు పైగా వచ్చిన ప్రేక్షకులతో పాటు రన్బీర్ కపూర్, యష్, సాయిపల్లవి ఇతర టీమ్ సభ్యులు ఈ షోకు హాజరయ్యారు. అయితే హిందీ కాకుండా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్ వెర్షన్ ప్లే చేశారు. అది కూడా అరగంట నిడివి తక్కువ ఉన్నది కావడం గమనించాల్సిన విషయం.

ఇక ప్రాథమిక రివ్యూల విషయానికి వస్తే కొందరు స్కేల్, విఎఫ్ఎక్స్, గ్రాండియర్ ని తెగ మెచ్చుకుంటున్నారు. రావణుడిగా యష్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాడని, స్క్రీన్ ప్రెజెన్స్ అదరగొట్టాడని చెబుతున్నారు. రన్బీర్ కపూర్, సాయిపల్లవి జోడికి సీతారాములుగా మంచి మార్కులే పడుతున్నాయి కానీ వాళ్ళను ఇంకొంచెం బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉండొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. దశకంఠుడి ఇంట్రో, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ గురించి ప్రత్యేక ప్రశంసలు వినిపిస్తున్నాయి.

అలాని నెగటివ్స్ లేవని కాదు. నిడివి, గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్స్, రెండో భాగం కోసం ఫస్ట్ పార్ట్ లెన్త్ ని అవసరానికి మించి సాగదీయడం లాంటి కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇండియా రిలీజ్ ఇంకో ఏడు రోజుల సమయముంది. ఈలోగా ఇలా టాక్ రూపంలో సినిమా మ్యాటర్ బయటికి రావడం కొంత ఇబ్బంది కలిగించే విషయమే అయినా దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత నమిత మల్హోత్రా కంటెంట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జనాన్ని మెస్మరైజ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు.

ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. నవంబర్ 5 నాటికి పరిస్థితిలో అనూహ్య మార్పు వచ్చి టికెట్లు దొరకనంత స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని రామాయణ టీమ్ బలంగా నమ్ముతోంది. ఎలాగూ బాలీవుడ్ మార్కెట్ లో గత కొన్ని నెలలుగా చెప్పుకోదగ్గ హిట్టు లేదు. దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ జోష్ ఎవరూ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు రామాయణ పార్ట్ 1 కనక డీసెంట్ టాక్ తెచ్చుకున్నా చాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం పక్కా..

This post was last modified on October 28, 2026 11:54 am

Share

Recent Posts

నవంబర్ నెలలో ఇంత రష్ ఏంటయ్యా

మాములుగా బాక్సాఫీస్ లెక్కల్లో నవంబర్ నెలని డ్రైగా భావిస్తారు. కారణం భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీపావళి…

25 minutes ago

స్థానికం `హోరాహోరీ`.. స‌ర్వేల లెక్క‌లివే… !

ఏపీలో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు ఎలా ఉంటుంది? అనేది ఆస‌క్తిగా మారింది.…

1 hour ago

ప‌వ‌న్ చెప్పింది అర్ధ‌మైందా జ‌గ‌న్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఉద్దేశించి జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.…

3 hours ago

జగన్ కంచుకోట బద్దలు

రాజ‌కీయం అంటే ఇంతే!.. ఊహించ‌ని ప‌రిణామాలు జ‌ర‌గ‌డ‌మే అస‌లైన రాజ‌కీయం. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎక్కడా ఏక‌గ్రీవాలు కారాద‌ని.. ఎక్క‌డా పోటీ…

9 hours ago

జైలు నుంచి పారిపోయి డ్రోన్లకు చిక్కారు

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోవడం తమిళనాడులో సంచలనం సృష్టిస్తుంది. ఒకేసారి…

13 hours ago

బాక్సాఫీసుని టెన్షన్ పెడుతున్న అర్నబ్

ముందే హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రకృతిని పూర్తిగా ఎదురుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ కేంద్రంగా ముంచేస్తున్న అర్నబ్…

13 hours ago