Movie News

రెండు పరీక్షలకు అనుపమ రెడీ

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో అనుపమ పరమేశ్వరన్ కు క్రేజ్ ఉండేది. శతమానం భవతి, అఆ, ప్రేమమ్ లాంటి హిట్లు తనకో మార్కెట్ ని తెచ్చి పెట్టాయి. అయితే స్టార్ హీరోల సరసన తగినన్ని అవకాశాలు రాకపోవడం వల్లనో లేదా రెగ్యులర్ పాత్రలు చేయకూడదని నియమం పెట్టుకోవడం వల్లనో రేసులో వెనుకబడిన మాట వాస్తవం. అక్కడికి కొత్త హీరో అనే క్యాలికులేషన్లు వేసుకోకుండా రౌడీ బాయ్స్ లాంటివి చేసినా ఫలితం దక్కలేదు. కిష్కిందపురి హిట్టయ్యాక కూడా గ్యాప్ వచ్చింది.

ఇప్పుడు కేవలం రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలతో అనుపమ పరమేశ్వరన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వాటిలో మొదటిది క్రేజీ కళ్యాణం రేపు థియేటర్లలో అడుగు పెడుతోంది. జైలర్ 2, రణబాలి లాంటి పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలున్నా సరే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో టీమ్ పెద్ద సాహసమే చేస్తోంది. సీనియర్ నటుడు నరేష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ రెండూ ఇందులో బలంగా ఉండబోతున్నాయి. కాంపిటీషన్ లో గరివిడి లక్ష్మి కూడా ఉంది.

వచ్చే నెల శర్వానంద్ బోగిలోనూ అనుపమ పరమేశ్వరన్ ఉంది. ఇది ఇంటెన్స్ విలేజ్ డ్రామా. ఏదో రెగ్యులర్ హీరోయిన్ పాత్రలాగా ఉండదు. టీజర్ చూస్తే అర్థమైపోతుంది. క్రేజీ కళ్యాణంలోనూ తన పాత్ర చుట్టే కథ నడుస్తుంది. భోగిలో అంత కాకపోయిన నటన డిమాండ్ చేసే ఎపిసోడ్స్ చాలా ఉంటాయనే క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు సంపత్ నంది ఓ రేంజ్ లో వయొలెంట్ డ్రామా ఇస్తున్నట్టు కనిపిస్తోంది. క్లిక్ అయితే మటుకు అనుపమకు మరిన్ని అవకాశాలు వస్తాయి.

ప్రమోషన్స్ లో అనుపమ చాలా యాక్టివ్ గా పాల్గొంటోంది. ఈవెంట్లలో డాన్స్ చేయడం నుంచి జిల్ జిల్ జిలేబీ వైరల్ సాంగ్ కు స్టెప్పులు వేయడం వరకు సోషల్ మీడియా అటెన్షన్ కోసం బాగానే కష్టపడుతోంది. వ్యక్తిగత జీవితంలో లవ్ బ్రేకప్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయిన ఈ కేరళ కుట్టి ప్రస్తుతం నార్మల్ అయిపోయింది. ఇప్పుడు రాబోయే రెండు టాలీవుడ్ సినిమాల్లో ఒకటి హిట్టయినా లేదా రెండు సక్సెస్ ఆయినా కెరీర్ మీద మరింత ఫోకస్ పెట్టేందుకు అవకాశం దక్కుతుంది. చూడాలి ఎలా వాడుకోనుందో.

This post was last modified on October 15, 2026 7:24 pm

Share

Recent Posts

చరణ్ అభిమానులు ప్రిపేర్ అవ్వాల్సిందే

పెద్ది కష్టానికి తగ్గ ఫలితం రాలేదని రామ్ చరణ్ అభిమానులు ఫీలవ్వడం అబద్దం కాదు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు వచ్చినా…

1 hour ago

వెంకటేష్ మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్

దసరా సెలవులు బాక్సాఫీస్ కు మంచి రెవిన్యూ తెచ్చే సీజన్. సరిగ్గా వాడుకుంటే పది రోజుల పాటు థియేటర్లకు కలెక్షన్లు…

2 hours ago

వరుస డిజాస్టర్లు… అయినా ఛాన్సులు

కన్నడ అమ్మాయి కృతి శెట్టికి కెరీర్ ఆరంభంలో దక్కిన విజయాలు చూసి.. తోటి హీరోయిన్లు అసూయ చెంది ఉంటారు. కేవలం…

3 hours ago

రణబాలి హిట్టవ్వడం ఎందుకు అవసరమంటే

రేపు ఉదయం ఏడు గంటలు మొదలుకుని రణబాలి షోలు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. ముందు రోజు ప్రీమియర్లు…

3 hours ago

జైలర్-3 కూడా ఉన్నట్లేనా?

భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా.. జైలర్-2. అంచనాలకు…

3 hours ago

శ్రీలీల తెరంగేట్రానికి మోక్షం దొరికింది

అదేంటి శ్రీలీల ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలయ్యింది ఇప్పుడు తెరంగేట్రం ఏమిటనుకుంటున్నారా. అసలు విషయం వేరే ఉంది. తొమ్మిది సంవత్సరాల…

4 hours ago