పెద్ది కష్టానికి తగ్గ ఫలితం రాలేదని రామ్ చరణ్ అభిమానులు ఫీలవ్వడం అబద్దం కాదు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు వచ్చినా మిగిలిన చోట్ల ఫ్లాప్ ముద్ర పడటం జీర్ణించుకోలేకపోయారు. అయితే దీని నుంచి పూర్తి ఉపశమనం సుకుమార్ సినిమా రూపంలో దక్కుతుందని ఆర్సి 17 కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇటీవలే ఆఫీస్ ఓపెనింగ్ చేశారు. ఇంకో వారం పది రోజుల్లో ఘనంగా షూటింగ్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సరే ఇక్కడి దాకా అంతా బాగానే ఉందనిపిస్తోంది కదూ.
అసలు ట్విస్ట్ ఏంటంటే ఆర్సి 17 రెండు భాగాలుగా రూపొందే అవకాశం ఉందట. స్క్రిప్ట్ దానికి అనుగుణంగానే సిద్ధం చేశారని సమాచారం. యాక్షన్ డ్రామాగా రూపొందే ఈ ప్యాన్ ఇండియా మూవీలో సుకుమార్ గతంలో టచ్ చేయని ఎలిమెంట్స్ ఉంటాయని అంటున్నారు. ఈ లెక్కన 2028లో మొదటి భాగం వస్తే ఇంకో ఏడాది తర్వాత పార్ట్ 2 ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అది కూడా సుకుమార్ ఎక్కువ బ్రేక్స్, రీషూట్స్ లేకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తేనే సుమా.
కానీ సుకుమార్ వర్కింగ్ స్టయిల్ ఎప్పుడూ వేగంగా ఉండదు. పర్ఫెక్షన్ కోసం తపించే క్రమంలో డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకే పుష్ప కోసం అల్లు అర్జున్ నాలుగు సంవత్సరాలకు పైగానే త్యాగం చేశాడు. అఫ్కోర్స్ దాని వల్ల వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ఇప్పుడు రాకా లాంటి ఇంటర్నేషనల్ మూవీకి దారి వేసింది. బహుశా ఇప్పుడు రామ్ చరణ్ నుంచి కూడా ఇంతే డెడికేషన్, కమిట్ మెంట్ సుకుమార్ ఆశిస్తూ ఉండవచ్చు.
ఇదంతా నిజమయ్యే పక్షం చరణ్ ఫ్యాన్స్ ముందే ప్రిపేర్ అయ్యి ఉండటం అవసరం. అప్డేట్స్ అప్డేట్స్ అంటూ సోషల్ మీడియాలో పదే పదే టీమ్ ని విసిగించడం కన్నా వచ్చేదాకా వెయిట్ చేయడం ఉత్తమం. ఇప్పటికే గేమ్ ఛేంజర్, పెద్దికి చాలా టైం ఖర్చు పెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు ఆర్సి 17 కోసం కూడా అదే చేయక తప్పదు. కాకపోతే టాలీవుడ్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్టర్ చేతిలో ఉన్నాడు కాబట్టి రంగస్థలంని మించిన మేజిక్ సినీ ప్రియులు ఆశించవచ్చు. అదే జరగాలి కూడా.
This post was last modified on October 15, 2026 9:14 pm
జైలర్ 2 లో హృతిక్ రోషన్ క్యామియో ఉందనేది ఎప్పుడో కన్ఫర్మ్ అయిన పాత న్యూస్. ఎంత నిడివి ఉంటుందనే…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో అనుపమ పరమేశ్వరన్ కు క్రేజ్ ఉండేది. శతమానం భవతి, అఆ, ప్రేమమ్ లాంటి హిట్లు…
దసరా సెలవులు బాక్సాఫీస్ కు మంచి రెవిన్యూ తెచ్చే సీజన్. సరిగ్గా వాడుకుంటే పది రోజుల పాటు థియేటర్లకు కలెక్షన్లు…
కన్నడ అమ్మాయి కృతి శెట్టికి కెరీర్ ఆరంభంలో దక్కిన విజయాలు చూసి.. తోటి హీరోయిన్లు అసూయ చెంది ఉంటారు. కేవలం…
రేపు ఉదయం ఏడు గంటలు మొదలుకుని రణబాలి షోలు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. ముందు రోజు ప్రీమియర్లు…
భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా.. జైలర్-2. అంచనాలకు…