ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన ఓ డీల్ ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన టీ నటరాజన్ ఇప్పుడు రూ.5 కోట్ల ఫీజుతో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. అంటే నటరాజన్ ఏడాది ఫీజు ఏకంగా రూ.5.75 కోట్లు తగ్గింది. ఇంత భారీ మొత్తం తగ్గించుకుని మరో జట్టుకు ఎందుకు వెళ్లారనేది చాలామందికి వస్తున్న సందేహం. అయితే ఈ డీల్‌లో నటరాజన్‌తో పాటు మరో ఆటగాడు కూడా ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులోని లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇచ్చింది. బదులుగా ఢిల్లీ నుంచి నటరాజన్‌ను తీసుకుంది. అన్సారీ ఫీజు రూ.40 లక్షలు కాగా, నటరాజన్ కొత్త ఫీజు రూ.5 కోట్లు. అంటే ఇది వేలంలో జరిగిన కొనుగోలు కాదు. రెండు ఫ్రాంచైజీలు పరస్పరం ఆటగాళ్లను మార్చుకున్న ట్రేడ్. ఇందులో నటరాజన్ ఫీజును కూడా తగ్గించారు.
అసలు ఢిల్లీ నటరాజన్‌ను ఎందుకు వదులుకుందనే విషయానికి వస్తే, గత రెండు సీజన్లలో అతని ప్రదర్శనను చూడాలి. 2025 వేలంలో రూ.10.75 కోట్లు వెచ్చించిన ఢిల్లీకి ఆశించిన ఫలితం దక్కలేదు. గాయం కారణంగా 2025లో రెండు మ్యాచ్‌లే ఆడారు. 2026లో పది మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినా ఐదు వికెట్లు మాత్రమే తీశారు. దీంతో భారీ ఫీజుతో కొనసాగించడం కంటే మరో ఆటగాడిని తీసుకోవాలని ఢిల్లీ భావించి ఉండొచ్చు.
అయితే ఢిల్లీలో రూ.10.75 కోట్లు వస్తున్నప్పుడు నటరాజన్ రూ.5 కోట్లకు ఎందుకు అంగీకరించారు అనే డౌట్స్ వస్తున్నాయి. అసలైతే ఐపీఎల్లో ఒకసారి వేలంలో దక్కిన ధర జీవితాంతం కొనసాగదు. ఫ్రాంచైజీ ఆటగాడిని వదిలేస్తే మళ్లీ వేలంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు పాత ధరే వస్తుందనే హామీ ఉండదు. ఈ పరిస్థితుల్లో తక్కువ ఫీజుతో మరో జట్టుకు వెళ్లడం కూడా ఆటగాడికి ఒక అవకాశమే. అయితే నటరాజన్ ఈ కారణంతోనే వెళ్ళి ఉండవచ్చు. మరోవైపు హైదరాబాద్‌కు నటరాజన్ కొత్త ఆటగాడేమీ కాదు. 2020 నుంచి 2024 వరకు సన్‌రైజర్స్ తరఫున ఆడారు. 2024 సీజన్లో 19 వికెట్లు తీశారు. చివరి ఓవర్లలో యార్కర్లు వేయగల భారత పేసర్ కావడంతో హైదరాబాద్ మళ్లీ తీసుకుంది.
This post was last modified on October 16, 2026 11:43 am
అనిరుధ్ రవిచందర్ పేరుకు తమిళ సంగీత దర్శకుడే కానీ.. ప్రస్తుతం ఇండియాలో అతనే నంబర్ వన్ అనడంలో ఎవరికీ సందేహాలు…
ఆ యువతీ యువకులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుని స్థిరపడదామని అనుకున్నారు. కానీ, విధి వక్రించింది. ఓ వ్యక్తిని…
కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి రిలీజ్ డేట్ల వ్యవహారం గురించి పంచులు వేశారు. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకపోయినా, అన్నది…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు శుక్రవారం తెరదీశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. తొలిరోజే ఉమ్మడి కడప, ఉమ్మడి…
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్టరీ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు…
నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…