రేపు ఉదయం ఏడు గంటలు మొదలుకుని రణబాలి షోలు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. ముందు రోజు ప్రీమియర్లు వేసే రిస్క్ తీసుకోకుండా టీమ్ మంచి పనే చేసింది. సోషల్ మీడియాలో ఒక వర్గం వల్ల ఏర్పడిన ప్రీ నెగటివిటీని తట్టుకోవాలంటే ఇలాంటి నిర్ణయాలు చాలా అవసరం. మెయిన్ రిలీజ్ డేట్ కి కట్టుబడుతూ అందరికి ఒకేసారి సినిమాని అందుబాటులోకి తేవడమనే స్ట్రాటజీ జైలర్ 2 కూడా పాటించింది కాబట్టి ఇందులో అనుమానపడేందుకు ఏమీ లేదు.
ఇక రణబాలి సక్సెస్ ఇండస్ట్రీకి ఎందుకు అవసరమనే పాయింట్ కు వద్దాం. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ప్యారడైజ్ నైజాంలో నెట్టుకొచ్చింది కానీ ఏపీ తదితర ప్రాంతాల్లో నష్టాలే మిగిల్చింది. దానికి ముందు వెనుక ఒకటి రెండు వారాలు సరైన పెద్ద ప్యాన్ ఇండియా మూవీ లేక థియేటర్ ఆక్యుపెన్సీలు అటు ఇటు ఊగుతున్నాయి. వస్తుందనుకున్న ఆదర్శ కుటుంబంతో పాటు వచ్చి ఉంటే బాగుండేదని ఫీలైన విశ్వంభర లాంటివి రాకపోవడం సెలవులను వృథా చేసింది.
సో ఈ అవకాశాన్ని విజయ్ దేవరకొండ సంపూర్ణంగా వాడుకోవాలి. టికెట్ రేట్లు పెంచలేదు. బడ్జెట్ దృష్ట్యా అడిగితే హైక్స్ వచ్చే అవకాశం ఉన్నా మైత్రి మూవీ మేకర్స్ దాని జోలికి వెళ్ళలేదు. కంటెంట్ మీద నమ్మకంతో రెగ్యులర్ ధరలతో ఇరుముడి లాగా అద్భుతం చేస్తుందని ఆశిస్తున్నారు. సో ఆడియన్స్ కంప్లయింట్ చేయడానికి లేదు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కనక సినిమాతో మెప్పిస్తే మటుకు అక్టోబర్ చివరి వరకు సందేహం లేకుండా సాలిడ్ రన్ దక్కుతుంది.
వరస ఫ్లాపులు ఎన్ని ఉన్నా రౌడీ బాయ్ కున్న ఫాలోయింగ్ దృష్ట్యా రణబాలి కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆడియన్స్ నుంచి ఆటోమేటిక్ గా మద్దతు దక్కుతుంది. హీరోయిన్ కం భార్య రష్మిక మందన్నతో కలిసి విస్తృతంగా ప్రమోషన్లు చేసిన విజయ్ దేవరకొండ ఫలితం పట్ల చాలా ఉద్వేగంగా ఉన్నాడు. దీని తర్వాత దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ తీస్తున్న రౌడీ జనార్దన్ వచ్చే ఏడాది రిలీజవుతుంది. ఆ తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్లో యాక్షన్ మూవీ ప్రారంభమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates