Movie News

ఆఫీస్ ఓపెన్ చేయడానికి రెండేళ్లా?

టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప పేరున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళిలా భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీయకపోయినా.. తన మార్కు టిపికల్ కథలు, అదిరిపోయే స్క్రీన్ ప్లేలతో దర్శకుడిగా బలమైన ముద్రే వేశాడు సుకుమార్. కాకపోతే ఆయనతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే.. సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడు. ఆయన కథలు ఒక పట్టాన తెమలవు. స్క్రిప్టు మీదే ఏళ్ల తరబడి పని చేస్తుంటాడు.

‘పుష్ప’ అనే కథను పూర్తి చేయడానికి ఆయనకు ఐదేళ్ల సమయం పట్టింది. ఒక కథను రెండు భాగాలు చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి సుకుమార్ మామూలు కష్టం పడలేదు. దీని తర్వాత అయినా ఆయన స్పీడందుకుంటాడేమో అనుకుంటే.. అలా ఏమీ జరగలేదు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తీయాల్సిన కొత్త సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లడానికి చాలా టైం పడుతోంది.

‘పుష్ప’ పూర్తవుతున్న దశలో రామ్ చరణ్.. ‘పెద్ది’ సినిమాను మొదలుపెట్టాడు. అది గత జూన్‌లో విడుదలైపోయింది. ఆ తర్వాత అతను మణికట్టుకు సర్జరీ చేసుకున్నాడు. దాన్నుంచి కోలుకున్నాడు కూడా. ఇంకా సుకుమార్‌తో తన సినిమా పట్టాలెక్కలేదు. ఇంకో నెలన్నర ఆగితే ‘పుష్ప’ రిలీజై రెండేళ్లవుతుంది. ఇంత కాలానికి సుకుమార్.. రామ్ చరణ్ సినిమాకు సంబంధించి ఇచ్చిన అఫీషియల్ అప్‌డేట్ ఏంటి అంటే, ఈ ప్రాజెక్టు కోసం ఆఫీస్ తెరవడం. సుకుమార్‌ ఆస్థాన నిర్మాణ సంస్థ అనదగ్గ మైత్రి మూవీ మేకర్స్‌లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. సుక్కు కూడా ఇందులో నిర్మాణ భాగస్వామి.

మైత్రి రవిశంకర్‌తో కలిసి చరణ్ సినిమా కోసం ఆఫీస్ తెరిచిన సందర్భంగా అందులో సుకుమార్ తన శిష్య బృందంతో కలిసి ఫొటోలు దిగి మీడియాకు రిలీజ్ చేశారు. ఆఫీస్ తెరిచారు అంటే ఇక నుంచి అక్కడే అధికారికంగా సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతాయన్నమాట. ముహూర్తానికి ఇంకా టైం ఉంది. ఈ సినిమా కోసం వేర్వేరు కథల మీద పని చేసిన సుకుమార్.. ఇటీవలే ఒక స్క్రిప్టును ఫైనలైజ్ చేశారు. సుకుమార్‌తో కలిసి ఆయన శిష్యులు కొందరు ఈ కథను తీర్చిదిద్దారు. చూస్తుంటే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టేలా ఉంది. 2027లోనే షూట్ ఉంటుందన్నది స్ఫష్టం.

This post was last modified on October 15, 2026 10:02 am

Share

Recent Posts

జబర్దస్త్ కమెడియన్… టాక్ ఆఫ్ ద టౌన్

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న…

11 minutes ago

అక్టోబర్ 15న తెలుగుప్రభ రీలాంచ్.. ‘జనం కోసం జర్నలిజం’

జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక…

3 hours ago

బిట్టు కష్టం వృథా అయిపోయింది

బిట్టూ తబాహి గుర్తున్నాడు కదా.... అతడేనండి బాబు. తమ ఊరిలో చెత్తా చెదారంతో నిండిపోయిన నదిని శుభ్రం చేసి రికార్థులకెక్కాడే.…

10 hours ago

మాయమైన దేవుళ్ళ కోసం ‘హైందవ’ వేట

ఒక గుడిని ఆధారంగా చేసుకుని అల్లుకున్న సినిమాలు కొత్తేమీ కాదు. కార్తికేయ నుంచి మహేంద్రగిరి వారాహి దాకా ఈ మధ్య…

12 hours ago

ఈడీ విచారణకు అవినాష్ రెడ్డి… ట్రంకు పెట్లలో పత్రాలు

వంద‌లు కాదు.. ఏకంగా కొన్ని వేల పేజీల‌కు పైగా బ్యాంకు ఖాతా లావాదేవీల వివ‌రాల‌తో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి…

14 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా

దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలో చేరబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న…

15 hours ago