Political News

ఎల్ నినో కూడా కరోనా లాంటి విపత్తే

దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం మీద అందులోనూ దక్షిణ భారతదేశం మీద దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు ప్రకటించడం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణాలో ఎల్ నినో పంజా విసురుతోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డంతో తీవ్ర విద్యుత్ కోతలు మొదలయ్యాయి. పంటలు దెబ్బ తినడంతో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరోనాతో పోల్చారు. ఎల్‌నినో కూడా కరోనా లాంటి విపత్తేనని, ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదని ప్రకటించారు.

రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. తమ పరిధిలో ఎల్‌నినో ప్రభావాన్ని లోతుగా అంచనా వేసి, సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను గుర్తించాలని సూచించారు. లేకపోతే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారని చెప్పారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా
రాబోయే సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయలన్నారు.

ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది డిసెంబర్ నాటికి తీవ్రం అవుతుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏప్రిల్, మే నాటికి ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి వచ్చే జూన్‌ వరకు అవసరమైన యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అలాగే రాష్ట్రంలో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి మీద సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రైతుల పంటలను కాపాడేందుకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారటం లేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌, జెన్‌కో సీఎండీ, సంబంధిత విభాగపు ఐఏఎస్‌ లను, ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేస్తానంటూ సీఎం తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు ఆ శాఖలోని క్షేత్ర స్థాయి సిబ్బంది చెప్పుకుంటున్నారు. సీఎం వార్నింగ్ తో విద్యుత్ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది.

This post was last modified on October 15, 2026 11:14 am

Share

Recent Posts

అయిదు సినిమాలు… ఎక్కడ చిరునామాలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని పూర్తి చేయడం ఒక యజ్ఞం అనుకుంటే దాన్ని థియేటర్ల దాకా తీసుకురావడం ఇంకో మహా సంకల్పంగా…

9 minutes ago

ఆఫీస్ ఓపెన్ చేయడానికి రెండేళ్లా?

టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప పేరున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళిలా భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీయకపోయినా.. తన మార్కు…

2 hours ago

జబర్దస్త్ కమెడియన్… టాక్ ఆఫ్ ద టౌన్

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న…

2 hours ago

టైసన్ నాయుడు ఏమయ్యాడని అడిగితే…

సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ ఒకప్పుడు తరచుగా సినిమాలతో పలకరించేవాడు. భారీ బడ్జెట్లలో, పెద్ద కాంబినేషన్లలో…

4 hours ago

అక్టోబర్ 15న తెలుగుప్రభ రీలాంచ్.. ‘జనం కోసం జర్నలిజం’

జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక…

5 hours ago

బిట్టు కష్టం వృథా అయిపోయింది

బిట్టూ తబాహి గుర్తున్నాడు కదా.... అతడేనండి బాబు. తమ ఊరిలో చెత్తా చెదారంతో నిండిపోయిన నదిని శుభ్రం చేసి రికార్థులకెక్కాడే.…

11 hours ago