Movie News

జబర్దస్త్ కమెడియన్… టాక్ ఆఫ్ ద టౌన్

జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. బూతుల మీద ఎక్కువ ఆధారపడతారని.. జోక్స్ చీప్‌గా ఉంటాయని.. సమాజం మీద చెడు ప్రభావం చూపించే షో ఇదని.. రకరకాల విమర్శలు వస్తుంటాయి. సినిమాల్లో కామెడీ క్రింజ్‌గా ఉంటే.. జబర్దస్త్ కామెడీ షోతో పోల్చి తక్కువ చేసే ప్రయత్నం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంటుంది.

ఇలాంటి అభిప్రాయం ఉన్న షో నుంచి వచ్చిన ఒక మామూలు కమెడియన్.. ఇప్పుడు జనాలతో శభాష్ అనిపించుకుంటున్న వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ సిరీస్.. ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాగా.. దీన్ని రూపొందించింది బాబు డేగల. ఈ పేరు విని గుర్తు పట్టడం కష్టం కానీ.. తన ఫొటో చూస్తే ఐడియా వస్తుంది.

ఎక్కువగా హైపర్ ఆది స్కిట్లలో కనిపించిన బాబు.. వేరే లీడర్ల స్కిట్లలోనూ సహాయ పాత్రలే పోషించాడు. అతడికి ఎక్కువగా డంబ్ క్యారెక్టర్లే ఇస్తుంటారు. అతను స్కిట్లోకి వచ్చాడంటే తన మీద వరుసబెట్టి పంచులు పడిపోతుంటాయి. దీని వల్ల ఆ ఇమేజ్ నిజ జీవితంలో కూడా క్యారీ అయిపోతుంటుంది. అందుకే బాబు అండ్ డంబ్ అనే ముద్ర పడిపోయింది. ఇలాంటి ఇమేజ్ ఉన్న వాడు.. ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి సెన్సిబుల్ సిరీస్ తీయడం విశేషమే. ఇందులో కామెడీ బాగా పేలింది. ఎమోషన్లూ వర్కవుట్ అయ్యాయి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌తో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రిలీజ్ ముంగిట దీని గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చ లేదు కానీ.. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ మొదలయ్యాక ఇందులోని సన్నివేశాలు, డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవడం మొదలుపెట్టాయి. జనం ఈ సిరీస్‌ను బాగానే చూస్తున్నారని సోషల్ మీడియాలో ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. జబర్దస్త్‌లో చిన్న కమెడియన్‌గా ఉన్న బాబు.. ఇలాంటి సిరీస్ తీయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్’ అనడానికి బాబునే ఉదాహరణ. సీజన్-1 హిట్టయిన నేపథ్యంలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కు అతను సీక్వెల్ కూడా తీయబోతుండడం విశేషం.

This post was last modified on October 15, 2026 9:53 am

Share

Recent Posts

రేసు నుంచి తప్పుకోనంటున్న దాదా

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న దాదా డిసెంబర్ 24 నుంచి వాయిదా…

3 hours ago

అక్క వివాదాలు కావాలనే వస్తున్నాయా

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో కొత్త వెబ్ సిరీస్ 'అక్క' స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన…

4 hours ago

తుఫాను ముంచుకు వస్తోంది తమన్

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే ఇప్పటికీ ముందు వరసలో వినిపించే పేరు తమన్. అయితే తన స్థాయికి…

4 hours ago

ఒకేసారి ఇన్ని పనులు ఎలా చిరు

ఒకపక్క నలభై దాటని స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసి, ఒకవేళ అది ఫ్లాప్ అయితే దాని గురించి…

5 hours ago

బీజేపీ వల్లే అనంతపురం చేజారిందా?

ఔను అంటున్నారు అనంతపురం ప్రజలు. రాష్ట్రంలోని మొత్తం 13 కార్పొరేషన్లలో 12 కార్పొరేషన్లు టీడీపీ, జనసేన కూటమి గెలుచుకుంది. ఒక్క…

8 hours ago

‘మావిగ‌న్’ ముంచేసింద‌న్నో !

మావిగ‌న్‌.. (మ‌చిలీప‌ట్నం-విజ‌య‌వాడ‌-గుంటూరు న‌గ‌రాల‌తో కూడిన రాజ‌ధాని) జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిందే!. దీనినే త‌మ…

9 hours ago