సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ ఒకప్పుడు తరచుగా సినిమాలతో పలకరించేవాడు. భారీ బడ్జెట్లలో, పెద్ద కాంబినేషన్లలో తన చిత్రాలు తెరకెక్కేవి. ఐతే గత కొన్నేళ్లుగా శ్రీనివాస్ బాగా స్పీడు తగ్గించేశాడు. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం కొన్నేళ్లు టాలీవుడ్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత భైరవం మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. అది నిరాశపరిచినప్పటికీ ‘కిష్కింధపురి’ ఆకట్టుకుంది. ఇప్పుడు ‘హైందవ’ అనే మిస్టిక్ థ్రిల్లర్‌తో రాబోతున్నాడు శ్రీనివాస్. కానీ దీని కంటే ముందు ‘టైసన్ నాయుడు’ అని శ్రీనివాస్ ఒక సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లానాయక్’ తీసిన సాగర్ కె.చంద్ర.. ‘టైసన్ నాయుడు’ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ లాంటి పెద్ద బేనర్లో ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో షూట్ పూర్తయిన ఈ సినిమా ఎంతకీ విడుదల కావట్లేదు. ‘హైందవ’ టీజర్ లాంచ్ సందర్భంగా మీడియాను కలిసిన శ్రీనివాస్‌కు ‘టైసన్ నాయుడు’ గురించి ప్రశ్న ఎదురైంది. ఆ సినిమా ఏమైందని అడిగితే.. దానికి సంబంధించి తన వర్క్ ఎప్పుడో పూర్తయిందని అతను చెప్పాడు. ఈ సినిమా ‘కిష్కింధపురి’ కంటే ముందే మొదలైనట్లు అతను తెలిపాడు.
14 రీల్స్ అధినేతలు ‘అఖండ-2’ తర్వాత ‘టైసన్ నాయుడు’ను రిలీజ్ చేస్తామన్నారని.. కానీ ఏమైందో తనకు తెలియదని శ్రీనివాస్ చెప్పాడు. ఈ సినిమా రిలీజ్ విషయంలో మీరేమే చేయట్లేదా అని అడిగితే.. తాను నిర్మాతను కాదని, ఈ విషయం నిర్మాతలనే అడగాలని తేల్చేశాడు శ్రీనివాస్. ‘అఖండ-2’ రిలీజ్ టైంలో 14 రీల్స్ ప్లస్ అధినేతలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పాత సినిమాల లెక్కలు తేలక ఈ సినిమా రిలీజ్ ఒకసారి వాయిదా పడింది. చివరికి రిలీజైనప్పటికీ.. ఆశించిన ఫలితం దక్కకపోవడంతో నిర్మాతల ఇబ్బందులు పెరిగినట్లున్నాయి. అందువల్లే ‘టైసన్ నాయుడు’ బయటికి రాలేకపోతున్నట్లుంది.
This post was last modified on October 15, 2026 10:13 am
టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప పేరున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళిలా భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీయకపోయినా.. తన మార్కు…
జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న…
జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక…
బిట్టూ తబాహి గుర్తున్నాడు కదా.... అతడేనండి బాబు. తమ ఊరిలో చెత్తా చెదారంతో నిండిపోయిన నదిని శుభ్రం చేసి రికార్థులకెక్కాడే.…
ఒక గుడిని ఆధారంగా చేసుకుని అల్లుకున్న సినిమాలు కొత్తేమీ కాదు. కార్తికేయ నుంచి మహేంద్రగిరి వారాహి దాకా ఈ మధ్య…
వందలు కాదు.. ఏకంగా కొన్ని వేల పేజీలకు పైగా బ్యాంకు ఖాతా లావాదేవీల వివరాలతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి…