Movie News

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత ఆలస్యం జరగడం అభిమానులకు ఆశ్చర్యం కంటే ఎక్కువ షాక్ కి గురి చేసింది. అక్టోబర్ 2, 9 వదిలేశారు సరే ఇప్పుడు కొత్త డేట్ ఏంటనే దాని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు అక్టోబర్ 30 అంటుండగా, నవంబర్ 20 కూడా పరిశీలనలో ఉందని ఇటీవలే తెలిసిన అప్డేట్. అదైనా అధికారికంగా ప్రకటించారా అంటే లేదు. దసరా తర్వాత చెబుతారట.

సరే ఇదంతా ఓకే కానీ కుటుంబం ముందు రాబోయే రోజుల్లో అసలు ముప్పు ఒకటుంది. పోస్ట్ పోన్ల వల్ల ఇప్పటికే బజ్ విషయంలో వెనుకబడిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి ఓపెనింగ్స్ అదిరిపోవాలంటే ఆ స్థాయిలో హైప్ సృష్టించాలి. ఈ విషయంలో టీమ్ బాగా వెనుకబడి ఉంది. ఎప్పుడో జనవరిలో వచ్చే తన సినిమా గురించి అనిల్ రావిపూడి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ హుషారు తెస్తుంటే ఇటు త్రివిక్రమ్ కనీస హడావిడి కూడా చేయకుండా మౌనంగా ఉంటున్నారు.

ఎంత వెంకటేష్ సినిమా అయినా సౌండ్ చేయకుంటే పనవ్వని పరిస్థితిలో ఉన్నాం మనం. కాకా మీద ఉన్నంత అంచనాలు విశ్వంభరకు ఎందుకు లేవంటే సమాధానం అందరికీ తెలుసు. మెగాస్టార్ ఇమేజ్ కన్నా ఎక్కువ కంటెంట్ మీద జనంలో ఉన్న ఆసక్తి బిజినెస్, ఓపెనింగ్స్ ని శాసిస్తోంది. ఇది ఆదర్శ కుటుంబంకు కూడా వర్తిస్తుంది. నారాయణమ్మ పాటకి రీచ్ బాగానే ఉన్నా మరీ సోషల్ మీడియాని ఊపేసే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఇది ఒకరకంగా మైనస్సే.

ఇంకా బ్యాలన్స్ పాటలు వదలాలి. ట్రైలర్ సిద్ధం చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. థియేటర్ బిజినెస్ క్లోజ్ చేయాలి. ముఖ్యంగా పోటీ లేకుండా చూసుకోవాలి. ఇన్ని ఒత్తిళ్ల మధ్య సరైన డేట్ సెట్ చేసుకోవడం అంత సులభంగా లేదు. వెంకటేష్ చూస్తేనేమో జనవరి 12 విడుదల షూట్ లో యమా బిజీ అయిపోయారు. నాగవంశీ జైలర్ 2 హడావిడి తగ్గే దాకా ఫ్రీ అయ్యేలా లేరు. సో దగ్గుబాటి అభిమానులకు ఇంకొన్ని రోజులు ఎదురు చూపులు తప్పవు.

This post was last modified on October 13, 2026 5:04 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

1 hour ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

2 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

7 hours ago