Political News

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప‌రిస్థితి బాగుంద‌ని .. కొన్ని జిల్లాల్లో అయితే.. చాలా అద్భుతాలు సృష్టించ‌నుంద‌ని అధిష్టానం చెబుతోంది. అంతేకాదు.. ఇటు సోష‌ల్ మీడియా స‌హా వైసీపీ చేతిలో ఉన్న ప్ర‌ధాన మీడియాలోనూ ప్ర‌చార ప‌ర్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల‌ను తీసుకుని వైసీపీ ప్ర‌త్యేక క‌థ‌నాల‌ను వండి వారుస్తోంది.

ముఖ్యంగా వైసీపీ ఎక్క‌డ ఎక్కువ‌గా బ‌ల‌హీనంగా ఉందో తెలుసుకుని.. అక్క‌డ పార్టీ ప‌రంగా ఈ ప్ర‌చారాన్ని ముమ్మరం చేస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు క‌ర్నూలు జిల్లాలో పార్టీ ప‌రిస్థితి తీవ్ర ఇబ్బందులుగా ఉంది. ఇక్క‌డ నాయ‌కుల‌కు వివాదాలు త‌ప్ప‌.. మ‌రో విష‌యం అర్థం కావ‌డం లేదు. కానీ, ఇక్క‌డ కేడ‌ర్‌ను సంతృప్తి ప‌రిచేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. అంతేకాదు.. పార్టీ ప‌రిస్థితి కూడా బాగుంద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు.. కూటమిలో విభేదాలు ఉన్నాయ‌ని కూడా వైసీపీ ప్ర‌చారం చేస్తోంది.

ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ వైసీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇక్క‌డ కీల‌క‌మైన నాయ‌కులు మౌనంగా ఉన్నారు. మ‌రికొంద‌రు పార్టీ మారారు. దీంతో వైసీపీ స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే గ‌గ‌నం అనుకునే ప‌రిస్థితి ఉభ‌య గోదావ‌రిలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. నాయ‌కులు కూడా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ ప‌రంగానే అంతా చూసుకుంటారులే! అనే ధోర‌ణి క‌నిపిస్తోంది. దీనిని స‌ర్దుబాటు చేసేందుకు.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ వైసీపీ బాగుంద‌ని ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

విజ‌య‌వాడ‌, తిరుప‌తి, విశాఖ వంటి కీల‌క కార్పొరేష‌న్ల ప‌రిధిలోనూ వైసీపీ చేతులు ఎత్తేసే ప‌రిస్థితిలోనే ఉంది. అయినప్ప‌టికీ.. ఆయా జిల్లాల్లో ప‌రిస్థితి బాగుంద‌ని.. ముఖ్యంగా కీల‌క‌మైన న‌గ‌రాల్లో మ‌రింత ఎక్కువ‌గా బాగుంద‌ని.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. వైసీపీని గెలిపించేందుకు ప్ర‌జ‌లు కూడా రెడీగానే ఉన్నార‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ ప్ర‌చారం ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వివాదాల‌ను ఏమేర‌కు అరిక‌డుతుంద‌న్న‌ది ప్ర‌శ్న గా మారింది. అంతేకాదు.. నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యాన్ని కూడా ఏమేర‌కు స‌ర్దుబాటు చేస్తుందో చూడాలి.

This post was last modified on October 13, 2026 9:55 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

1 hour ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

6 hours ago