Movie News

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే వాళ్ల‌తోనే ప‌ని చేస్తారు. ముఖ్యంగా సంగీత ద‌ర్శ‌కుల విష‌యంలో ఇంకో ఆప్ష‌న్ ఆలోచించ‌కుండా ఒక్క‌రితోనే ప‌ని చేస్తూ వ‌చ్చిన ద‌ర్శ‌కులు టాలీవుడ్లో ఇద్ద‌రున్నారు. ఒక‌రు రాజ‌మౌళి అయితే.. ఇంకొరు సుకుమార్. జ‌క్క‌న్న మొద‌ట్నుంచి కీర‌వాణితోనే ప్ర‌యాణం సాగిస్తుంటే.. సుక్కు ఏమో దేవిశ్రీ ప్ర‌సాద్‌ను వ‌దిలిపెట్ట‌లేదు.

వీళ్లిద్ద‌రూ సినిమాలు తీసినంత కాలం ఆ ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కుల‌తోనే సాగిపోతార‌ని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సుకుమార్ మాత్రం.. దేవిని వదిలేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్‌తో తన కొత్త చిత్రానికి అనిరుధ్ రవిచందర్‌ను సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసినట్లు ఓ వార్త హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.

సుకుమార్.. దేవి స్థానంలో ఇంకొకరితో పని చేయాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చినపుడు ఆయన కొత్త సౌండ్ కోరుకుంటున్నాడని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మ్యూజిక్ వద్దనుకుంటున్నాడని భావించారు అందరూ. ఈ క్రమంలోనే ‘దురంధర్’ సంగీత దర్శకుడు శశ్వత్ సచ్‌దేవ్ పేరు తెరపైకి వచ్చింది. ఇంకా ఏవో పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. శశ్వత్ అంటే ఒక డిఫరెంట్ సౌండ్ వినబోతున్నామని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడేమో అనిరుధ్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. సుకుమార్ అసలేం మార్పు కోరుకుంటున్నాడనే ప్రశ్న తలెత్తుతోంది.

అనిరుధ్ సంగీతం దేవితో పోలిస్తే కొంచెం భిన్నమే కానీ.. అతడి మ్యూజిక్ కూడా కమర్షియల్ మీటర్లోనే సాగుతుంది. ఈ మాత్రం మ్యూజిక్ దేవి ఇవ్వలేడా అన్నది ప్రశ్న. గతంతో పోలిస్తే దేవి పనితనం కొంత తగ్గినప్పటికీ.. సుకుమార్ అంటే అతను ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. ప్రాణం పెట్టి పని చేస్తాడు. దేవితో సుక్కుకు ఉన్న సింక్, తనతో ఉన్న సౌలభ్యం ఇంకెవరితో అయినా కుదురుతుందా అన్నది ప్రశ్న.

సుకుమార్ మనసు తెలుసుకుని మ్యూజిక్ ఇచ్చే దేవిని ఆయన ఎలా వదిలిపెట్టాడా అని ఇప్పటికీ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. చరణ్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే వార్త నిజం కాకపోతే బాగుండని, దేవితోనే పని చేయాలని వీళ్లిద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

This post was last modified on October 12, 2026 12:15 pm

Share

Recent Posts

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

49 minutes ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

53 minutes ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

2 hours ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

2 hours ago

ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం పవన్

2024 ఎన్నికల ముందు నుంచి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదర్చడంలో ఏపీ సీఎం…

3 hours ago

జైలర్‌ 2 అంచనాల బరువు తగ్గిందా

ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…

3 hours ago