జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని.. వదిలి పెట్టేది లేదని.. వారికి తప్పకుండా పోటీచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అయితే.. కూటమి బలోపేతానికి మాత్రం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి బలంగా ఉన్నప్పుడే.. వ్యవస్థ, రాష్ట్రం కూడా బలంగా ఉంటాయని తేల్చి చెప్పారు. తాజాగా పోలవ రం జిల్లాలో పర్యటించిన ఆయన అడవితల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పుడు మన కోసం..
2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. అప్పట్లో రాష్ట్రం కోసం.. వ్యవస్థలను బాగు చేయడం కోసం వారితో పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుత ముఖ్య మంత్రి 2023-24 మధ్య జైల్లో ఉంటే.. ఎవరూ బయటకు రాలేదు. అప్పుడు మనమే ముందుకు వచ్చాం. మన వీర మహిళలు, జనసైనికులే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. నాడు రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు మన కోసం.. మీ కోసం.. ఎన్నికల్లో జనసేన నిలబడుతుంది అని పవన్ వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో సమానంగానే జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పారు. ఎక్కడా, ఎవరినీ నొప్పించకుండానే ఈ ప్రయత్నం సాగుతుందన్నారు. కూటమి బలోపేతం చేసే బాధ్యతను కూడా వీర మహిళలు, జనసైనికులు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టా మన్న పవన్ .. ఇకపైనా ఇవి కొనసాగుతాయని తెలిపారు. గిరిజన బిడ్డల మెడల్లోని ఎర్రటి కండువాలే.. వారి శక్తిని చాటుతాయని.. ఇవి ఓట్ల రూపంలో కూటమికి రావాలని పిలుపునిచ్చారు.
గిరిజన ప్రాంతాల్లో కేవలం కూటమి వైపు మాత్రమే ఓట్లు పెరిగేలా చూడాలని యువతకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కూటమి బలంగా ఉంటే.. ఐక్యంగా ముందుకు సాగితే.. ఓట్లు పడితే అప్పుడు మరిన్ని అభివృద్ధిపనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని గిరిజన బిడ్డలు దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజనులకు మరిన్ని ఉపాధి మార్గాలను చూపిస్తున్నామన్నారు. కూటమి బాగుండడంతోపాటు.. వ్యవస్థలు కూడా బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు.
This post was last modified on October 13, 2026 11:39 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…