ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికి పోతోంది. లక్షలాది మంది విద్యార్థులు, యువకులు జంతర్ మంతర్ వద్దకు భారీగా తరలి వస్తుందటంతో ప్రభుత్వం భారీగా పోలీసులను, రక్షక బృందాలను రంగంలోకి దించింది. దాంతో పోలీసులు నిరసనకారులపై విరుచుకొని పడుతున్నారు. దొరికిన వాడ్ని దొరికినట్టే చితకబాదుతున్నారు. సుమారు 7 వేల మందిని అరెస్టు చేసి రహస్య ప్రదేశాలకు తరలించడంతో ఆందోళనకారులను రెచ్చగొట్టినట్టయ్యింది. ఈక్రమంలో ‘ కొడతావా… కొట్టుకో.. ఎంత కొట్టుకుంటావో కొట్టుకో ‘ అంటూ చొక్కా విప్పి చాతి చూపించడం వైరల్ అయ్యింది.
ఢిల్లీలోని దారులన్నీ జంతర్ మంతర్ వైపే పరుగులు తీస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న విద్యార్థులను నిలవరించడం ఎవరికీ చేత కావట్లేదు. ఇప్పటికే ప్రభుత్వం రైల్వే స్టేషన్లను మూసి వేసివేసింది. ఢిల్లీలోని 45 మెట్రో స్టేషన్లకు డోర్లు వేసేసింది. ఇంటర్నెట్ కట్ చేసింది. అయినా చీమల పుట్ట పగిలినట్టు విద్యార్థులు, యువకులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు లాఠిలకు పనిచెబుతున్నారు.
ఈక్రమంలో ఓ విద్యార్థి పోలీసుల వద్దకు స్వయంగా వెళ్లి కొడతావా కొట్టు అంటూ చాతీ చూపించాడు. ఆగ్రహానికి గురైన పోలీసులు అతడిని లాఠీలతో కొట్టారు. ఈ దృశ్యం చూసిన మిగతా విద్యార్థులు పోలీసుల మీద మండి పడ్డారు. పోలీసులకు తిరగబడ్డారు. ఊహించని ఈ ఘటనతో పోలీసులకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. మౌనంగా పక్కకు తప్పుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల మీద తిరగబడిన విద్యార్థిని నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
కొందరు మేధావులు దేశ స్వాతంత్ర్య పోరాటన్ని గుర్తు చేసుకుంటున్నారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా మద్రాసులో సైమన్ గో బ్యాక్ నిరసనలు జరిగాయి. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు కాల్చండిరా అంటూ చాతీ చూపించడం చరిత్రలో నిలిచిపోయింది. మరో కొన్ని నెలల్లో 80 వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోబోతున్న సందర్బంలో మళ్ళీ అలాంటి దృశ్యం ఢిల్లీ లో కనిపించిందని మేధావులు చెబుతున్నారు. నేడు మన పోలీసులకు చాతీ చూపించాల్సి రావడం బాధాకరమని ఫీల్ అవుతున్నారు.
This post was last modified on October 11, 2026 8:29 am
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…