వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ క్రమంలోనే అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. నాటి నిరసనలపై అనేక విమర్శలు, కేసులు కూడా నమోదయ్యాయి. ఇక, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని లేదా ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోని ఇందియా కూటమి నిరసనలు చేస్తోంది.
మరోవైపు ఇదే అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ నెల 10న(శనివారం) పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించింది. దీనికిగాను యువతను కూడా సమీకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు(కేంద్రహోం శాఖ పరిధిలో ఉంటారు) రాజధానిని అష్టదిగ్భంధనం చేశారు. ఢిల్లీకి దారి తీసే అన్ని మెట్రో రైల్వే స్టేషన్లను 24 గంటల ముందుగానే మూసి వేశారు. అలానే ప్రైవేటు ట్రావెల్స్‌పైనా నిషేధం విధించారు. రైళ్లలో వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. గుంపులుగా రాజధానికి చేరుకునే వారికి అవకాశం లేదని ప్రకటించారు. మొత్తంగా రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి ప్రవేశాన్ని దాదాపు నిషేధించారు.
ఈ పరిణామాలపై కొందరు సామాజిక కర్తలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని 57 మెట్రో రైల్వే స్టేషన్లను మూసి వేయడంపై పిటిషన్ వేశారు. అలానే ప్రజా రవాణాపైనా ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నించారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. కీటకాలపై సుత్తులను ప్రయోగిస్తున్నారా? అని ప్రశ్నించింది.
ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శలు చేసేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో పౌరుల భద్రతకు కూడా ప్రాధాన్యం ఉంటుందని వ్యాఖ్యానించింది. నిరసనల కారణంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందన్న పోలీసుల తరఫున వాదనలను తోసిపుచ్చింది. నిరసన కారులు దేశ పౌరులేనని వ్యాఖ్యానించింది. అదే సమయంలో సాధారణ పౌరుల భద్రతకు కూడా పోలీసులు పూచీ వహించాలని పేర్కొంది.
ఈ కేసు తీర్పు అనంతరం.. కాక్రోచ్ జనతాపార్టీ నేత అభిజిత్ దీప్కే స్పందిస్తూ.. యువత చేపడుతున్న నిరసనలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం భయపడుతున్నట్టయితే.. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆంక్షలు విధించాలని కోరారు. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా కూడా యువత నిరసనలు చేపట్టేందుకు రెడీ అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా నిషేధాలు, మూసివేతలు విధించాలన్నారు. యువతను ఆపలేరని వ్యాఖ్యానించారు. ఏదైనా ఆపాలని అనుకుంటే ముందుగా ఎన్నికల కమిషనర్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
This post was last modified on October 9, 2026 9:16 pm
ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…
తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే హవా చూపించాయి.…
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…