మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో పాటు ఇంటర్నేషనల్ వైడ్ గా జెండా పాతాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక ఈ ట్రెండ్ పైనే ప్రముఖ రచయిత కోన వెంకట్ ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. మన దగ్గర ఇప్పుడు అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేసే దర్శకులకు కొరత లేదు. సరికొత్త ఐడియాలతో వచ్చే మేకర్స్ టాలీవుడ్ లో చాలామందే ఉన్నా, మన స్టార్ హీరోలు మాత్రం వారిని ఏమాత్రం కన్సిడర్ చేయట్లేదని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు.
కేవలం తమ ఇమేజ్ కు, పాన్ రేంజ్ కు సెట్ అయ్యే వాటి కోసమే చూస్తూ ఈ కొత్త ఐడియాలను పక్కన పెడుతున్నారనేది ఆయన వాదన. ఈ ప్రాసెస్ లో మన స్టార్లు విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారని ఈ సీనియర్ రైటర్ కుండబద్దలు కొట్టారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అనే ట్యాగ్స్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటూ అసలు ట్రాక్ తప్పుతున్నారని ఆయన కామెంట్ చేశారు. నిజానికి ఒక్కో ప్రాజెక్ట్ కోసం ఏళ్ల తరబడి కూర్చోవడం వల్ల ఇటు హీరోల కెరీర్ స్లో అవ్వడంతో పాటు అటు ఇండస్ట్రీ రొటేషన్ కూడా దెబ్బతింటోంది.
ముఖ్యంగా ఈ గ్యాప్స్ వల్ల థియేటర్ల వ్యవస్థ కుదేలవుతోంది. మార్కెట్ లో ఉన్న టాప్ హీరోలు కనీసం ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటే ఎగ్జిబిషన్ సెక్టార్ కు పండుగే అని కోన వెంకట్ గుర్తుచేశారు. ఒక పెద్ద సినిమా వస్తే ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు లాభాల బాట పడతాయి. కానీ మూడేళ్లకో సినిమా రావడం వల్లే ఇప్పుడు ఈ థియేట్రికల్ క్రైసిస్ నడుస్తోంది.
మన దగ్గర అసలు స్టోరీల సమస్యే లేదని ప్రూవ్ చేయడానికి ఆయన ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. హీరోలు టైమ్ ఇస్తే వారం వారం ఒక కొత్త డైరెక్టర్ ను తీసుకెళ్లి అదిరిపోయే కథలు వినిపించడానికి తాను రెడీ అని ఆయన ఓపెన్ గా చెప్పారు. గ్లోబల్ మార్కెట్ కు వెళ్లడం ఇండస్ట్రీ గ్రోత్ కు కచ్చితంగా అవసరమే. కానీ దానికోసం సొంత మార్కెట్ ను, ఇక్కడి ఎకనామిక్స్ ను గాలికి వదిలేయడం కరెక్ట్ కాదనేది కోన వెంకట్ మాటల్లోని అసలు ఉద్దేశం. మరి మన హీరోలు ఈ విషయం గురించి ఆలోచిస్తారో లేదో చూడాలి.
This post was last modified on October 10, 2026 9:26 pm
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…