తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. మయూరి, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇలా ఎన్నో అద్బుత ప్రయోగాత్మక చిత్రాలను అందించిన సింగీతం.. చివరగా ‘సింగ్‌గీతం’తో మరోసారి తన మార్కు చూపించి వెళ్లిపోయారు. 94 ఏళ్ల వయసులో సినిమా తీసి మెప్పించడం అంటే చిన్న విషయం కాదు.
ఆ చిత్రం తర్వాత కూడా ఆయనేమీ సినిమాను వదిలిపెట్టలేదు. చివరి శ్వాస వరకు ఆయన సినిమానే జీవితంగా బతికారనడానికి సెప్టెంబరు 5న ‘ఎ ఫ్రూట్ కట్స్ ద నైఫ్’ పేరుతో ఒక స్క్రిప్టు గురించి తనకు సింగీతం మెసేజ్ పెట్టినట్లు దర్శక నిర్మాత నాగ్ అశ్విన్ వెల్లడించడమే రుజువు. సింగీతం వారి తపన గురించి ఇంతకంటే ఏం చెప్పాలి? నిన్న సింగీతం మరణవార్త తెలిసినప్పటి నుంచి తెలుగు సినిమా ప్రియులు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతూ ఘన నివాళి అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో అద్భుతమైన పోస్టులు పడుతున్నాయి. సింగీతం లాంటి లెజెండరీ డైరెక్టర్‌కు ఘన నివాళే దక్కుతోంది. ఇందులో మేజర్ క్రెడిట్ నాగ్ అశ్విన్‌కే ఇవ్వాలనడంలో సందేహం లేదు.
తెలుగు వారు చాలామంది దిగ్గజాలను సరిగా గౌరవించుకోలేకపోయారని.. వారి లెగసీని సెలబ్రేట్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఆఖరికి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయినపుడు కూడా తెలుగువారి నుంచి సరైన ట్రిబ్యూట్ లభించలేదనే విమర్శలు ఉన్నాయి. చెన్నైలో స్థిరపడ్డ చాలామంది దిగ్గజాల విషయంలో ఇదే జరిగింది. కానీ సింగీతంకు మాత్రం చివరి దశలో సరైన గౌరవం దక్కిందంటే అందుకు కారణం నాగినే.
సింగీతం 90వ దశకం తర్వాత సరైన సినిమా తీయలేదు. ‘వెల్కం ఒబామా’ సహా చాలా సినిమాలకు తెలుగులో సరైన రిలీజ్ కూడా దక్కలేదు. సింగీతం సినిమాలు తీయడం మానేశాక అందరూ ఆయన్ని పూర్తిగా మరిచిపోయారు. ఆయన లెగసీ గురించి మాట్లాడ్డమే మానేశారు. ఇలాంటి టైంలో దశాబ్దాల కిందట తీయాలనుకున్న ‘సింగ్‌గీతం’ కాన్సెప్ట్‌కు ఇప్పుడు తన టీంతో కలిసి జీవం పోయడమే కాక.. స్వయంగా ఆ చిత్రాన్ని నిర్మించాడు నాగి.
అతను అసోసియేట్ కావడం వల్లే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. మంచి రిలీజ్ కూడా లభించింది. విడుదల తర్వాత కూడా సినిమాకు మంచి స్పందనే వచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకుని.. సింగీతం లెగసీని సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు ఆయన మరణ వార్త తెలిశాక కూడా ఇంతగా జనం స్పందిస్తున్నారంటే.. ‘సింగ్‌గీతం’ చిత్రంతో మళ్లీ ఆయన వార్తల్లో నిలవడం వల్లే.
మధ్యలో ఆ సినిమా రాకపోతే.. సింగీతానికి ఇలాంటి ట్రిబ్యూట్ ఉండేది కాదు. ఈ లెజెండరీ డైరెక్టర్‌కు ఘన నివాళి దక్కేలా చూడడంలో నాగి పాత్ర ఎంతో కీలకం అని చెప్పాలి. అందుకే సింగీతం ఘనతలను కొనియాడుతూనే.. నాగి మీద సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు తెలుగు నెటిజన్లు.
This post was last modified on October 8, 2026 7:34 am
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…