Movie News

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం ఉంటుంది. శంబాల లాంటి హిట్ కొట్టిన ఆది సాయికుమార్ హీరో అంటే ఖచ్చితంగా బజ్ రావాలి. కానీ ఎస్ఐ యుగంధర్ విషయంలో రివర్స్ అయ్యింది. మొన్న అక్టోబర్ 2 ఇది విడుదలైన సంగతే జనాలకు గుర్తు రాలేనంత వీక్ గా ప్రమోషన్లు చేసి మొక్కుబడిగా థియేటర్లకు తీసుకొచ్చారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల తగిన కౌంట్ లో స్క్రీన్లు కూడా దక్కలేదు.

ఇంతకీ ఎస్ఐ యుగంధర్ లో ఏముందో ఒక లుక్ వేద్దాం. స్టోరీ పరంగా ఇదో రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లరే. సిటీ సరిహద్దుల్లో గుర్తు తెలియని శవం దొరుకుతుంది. అధికారులు దాన్ని గ్యాంగ్ వార్ మర్డర్ గా భావిస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న యుగంధర్ (ఆది సాయికుమార్)కి దాని వెనుక పెద్ద మెడికల్ మాఫియా ఉందని అర్థమవుతుంది. అయితే వ్యక్తిగతంగా ఒక తీవ్రమైన సమస్యతో బాధ పడుతున్న ఇతనికి కేసు ముందుకు వెళ్లేకొద్దీ ప్రమాదాలు చుట్టుముడతాయి. వాటిని ఎలా దాటుకుని గెలిచాడనేదే స్టోరీ.

దర్శకుడు రాఘవేంద్ర కటారి తీసుకున్న నేపథ్యంలో కొత్తదనం లేకపోయినా స్క్రీన్ ప్లేతో ఇలాంటివి ఎంగేజింగ్ గా తీయొచ్చు. అయితే ఫ్లాష్ బ్యాక్ ప్రహసనంలో ప్రధాన పాత్రలు అన్నింటికీ గతాన్ని పెట్టడంతో విసుగు వస్తుంది. ట్విస్టులు చాలా మటుకు సులభంగా గెస్ చేసేలా ఉంటాయి. హీరోకున్న ప్రాబ్లమ్ కూడా మరీ కొత్తదేం కాదు. గతంలో చూసిన ఎన్నో క్రైమ్ సినిమాల మెయిన్ పాయింట్లు తీసుకుని దీన్ని కుట్టినట్టుగా ఉంది తప్పించి డిఫరెంట్ అనిపించుకునే అవకాశాన్ని వదిలేసింది.

అయినా ఇంత హఠాత్తుగా పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేయడం ఒక మైనస్ అయితే ఉన్న కంటెంట్ కూడా మెప్పించేంత లేకపోవడం ఇంకో లోపం. ఓటిటి డెడ్ లైన్ వల్ల ఇంత హడావిడిగా వదిలారా లేక ఇంకేదైనా కారణం ఉందేమో తెలియదు కానీ ఆది సాయికుమార్ కు ఇది నిరాశ కలిగించే పరిణామమే. ఈ మధ్య డిజిటల్ లో కూడా బాగున్న సినిమాలకే ట్రోలింగ్ తప్పడం లేదు. అలాంటిది ఈ ఎస్ఐ యుగంధర్ లాంటివి ఏమేరకు మెప్పిస్తాయో తెలియాలంటే స్ట్రీమింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి.

This post was last modified on October 5, 2026 10:18 am

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

11 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

12 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

12 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

12 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

13 hours ago