Movie News

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా బాహుబలి ప్రొడ్యూసర్లు ఆర్కా మీడియా ప్రొడక్షన్ పార్ట్ నర్. ఈ కారణాలు చాలు రాజమౌళి మద్దతు ఇవ్వడానికి. విడుదల ముందు వరకు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఈ ప్రివిలేజ్ బాగా వాడుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా తీసుకొచ్చింది. మహేష్ బాబుతో ట్విట్టర్ లో చాంతాడంత రివ్యూ రాయించింది. ఇవన్నీ ప్రీమియర్ ముందు వరకు పని చేశాయి.

తీరా చూస్తే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఆశించిన పెర్ఫార్మన్స్ ఇవ్వడం లేదు. వీకెండ్ లోనూ బాక్సాఫీస్ వద్ద ఎదురీదింది. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయిస్తే మిగిలిన చోట్ల స్ట్రగులవుతున్న మాట వాస్తవం. కొన్ని చోట్ల తెల్లకాగితం డామినేషన్ స్పష్టంగా ఉంది. వారణాసి పనుల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్ల కోసం టైం కేటాయించారు. వినాయక చవితి లడ్డు వేలంలో పాల్గొనడం దగ్గర నుంచి సెలెబ్రిటిల షోకు ఇండస్ట్రీ పెద్దలు వచ్చేలా ఎన్నో చేశారు.

సరే ఫలితాలు ప్రతిసారి అందరి చేతుల్లో ఉండవు కానీ సినీ ప్రియుల మనసులో ఒక డౌట్ బాగా కొడుతోంది. పర్ఫెక్షనిస్ట్ గా పేరున్న జక్కన్న జడ్జ్ మెంట్ చాలా కరెక్ట్ గా ఉంటుంది. మర్యాదరామన్న లాంటి చిన్న చిత్రం నుంచి ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాండియర్ దాకా ఆయన లెక్క ఏనాడూ తప్పలేదు. మరి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ స్క్రిప్ట్ జక్కన్నకు వినిపించినప్పుడు ఇందులో అన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయని ఎందుకు గుర్తించాలేదని సగటు ప్రేక్షకుల ప్రశ్న.

చిన్న పిల్లల మీద సినిమాలు ఈ మధ్య రావడం లేదు. నిజమే. అంతమాత్రాన ఒక చిన్న పాపని పెట్టి సరైన కథా కథనాలు లేకుండా హాఫ్ బాయిల్డ్ ఎగ్ లాంటి మూవీ తీస్తే ఖచ్చితంగా తిరస్కారం ఉంటుంది. డోరేమాన్ కార్టూన్ సినిమాకు నిన్న మొన్న చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. కానీ ట్రబుల్ అంత దూకుడుగా లేకపోవడం షాక్ కలిగించే విషయం. ఆదర్శ కుటుంబం వాయిదా పడింది కాబట్టి ఇంకో వీకెండ్ అవకాశం దక్కింది కానీ దాన్ని ట్రబుల్ ఏ మేరకు వాడుకుంటుందనేది వేచి చూడాలి.

This post was last modified on October 5, 2026 10:47 am

Share

Recent Posts

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

48 minutes ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

12 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

12 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

13 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

13 hours ago