త్వరలోనే జరగనున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఇటీవలి వరకు కోవెలమూడి రవీంద్ర (నాని) గుంటూరు మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే, త్వరలో జరగబోయే పూర్తిస్థాయి స్థానిక సంస్థల ఎన్నికలలో మేయర్ స్థానం ‘ఓపెన్ కేటగిరీ’ కిందకు వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సహా మిత్రపక్ష పార్టీలలో తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఈ రేసులో ముందంజలో ఉన్నారు
టీడీపీ యువనేత మాదల చైతన్య పేరు ప్రస్తుతం మేయర్ రేసులో బలంగా వినిపిస్తోంది. అలాగే, సీనియర్ కార్పొరేటర్ అయిన వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. కోవెలమూడి రవీంద్ర (నాని) సైతం రాబోయే ఎన్నికల్లో మళ్లీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు మేయర్ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల సమన్వయానికి సంబంధించిన పూర్తి బాధ్యతలను కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు అప్పగించారు. అలాగే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా అభ్యర్థి ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక, కూటమి మిత్రపక్షం బీజేపీ కూడా ఈ సీటును దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడును పార్టీలోకి ఆహ్వానించి, ఆయన ద్వారా మేయర్ పీఠాన్ని దక్కించుకునే వ్యూహంతో బీజేపీ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా గుంటూరులో ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వహకురాలు ప్రముఖ డాక్టర్ కూడా ఈ రేసులో ముందున్నట్టు చెబుతున్నారు. అలానే.. మాజీ మంత్రి శనక్కాయల అరుణ కోడలు కూడా ఈ రేసులో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు వైసీపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కూటమిని ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన అచ్చాల వెంకటరెడ్డితో పాటు మరికొందరు కార్పొరేటర్ల పేర్లను పార్టీ పరిశీలిస్తున్నారు. వీరిలో పార్టీ సీనియర్ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి వారసుడి పేరు కూడా ఉండడం గమనార్హం. మొత్తంగా గుంటూరు మేయర్ పీఠంపై పాలిటిక్స్ జోరుగానే సాగుతున్నాయి.
This post was last modified on October 8, 2026 7:13 am
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…