ది ప్యారడైజ్ టాక్, బాక్సాఫీస్ స్టేటస్, టాక్స్, రివ్యూస్ కాసేపు పక్కన పెడదాం. ఎక్కడిదాకా వెళ్తుందనేది తేలడానికి కనీసం వీకెండ్ దాకా ఆగాల్సిందే. సోషల్ మీడియాలో ఈ సినిమా మీద జరుగుతున్న డిస్కషన్ ఈ మధ్య కాలంలో దేనికీ చూడలేదన్నది వాస్తవం. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా నాని ఎంతగా మార్కెట్ లో హాట్ టాపిక్కయ్యాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాటర్ న్యాచురల్ స్టార్ గురించి కాదు. శిఖంజి మాలిక్ గా నటించిన మోహన్‌బాబు గురించి.
మోహన్‌బాబు విలన్ గా నటించడం కొత్త కాదు. అల్లుడుగారు హిట్ కొట్టేదాకా ఆయన చేసినవి అధిక శాతం ప్రతినాయక పాత్రలే. ఎంత నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ చాలా పేరు తీసుకొచ్చాయి. 90 దశకంలో అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, పెదరాయుడు లాంటివి మాస్ మార్కెట్ ని అమాంతం పెంచేశాయి. ఆ తర్వాత వరస ఫ్లాపులు క్రమంగా వైభవాన్ని తగ్గిస్తే విష్ణు, మనోజ్ కెరీర్ ప్లానింగ్ కోసం ఆయన చేసిన త్యాగాలు కొంత కాలం వెండితెరను దూరం చేశాయి. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే ప్యారడైజ్ లో మోహన్ బాబు విలనిజం పీక్స్ లో ఉంది. మధ్యలో రాఘవ్ జుయెల్ కి ప్రాధాన్యం ఇచ్చినా కలెక్షన్ కింగ్ తెరమీద కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్ వింటేజ్ ఫీలింగ్ తెచ్చుకున్నారు. నానితో ఫేస్ అఫ్ ఆలస్యంగా జరిగినప్పటికీ ఫ్లాష్ బ్యాక్ లో మోహన్‌బాబు భయపెట్టిన తీరు, ఆయన చుట్టూ అల్లిన ప్రపంచం డిఫరెంట్ గా అనిపించాయి. అలాని యునానిమస్ గా అంత పాజిటివ్ అని కాదు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సంపూర్ణంగా వాడుకోలేదన్నది నిజం.
ఇకపై దర్శక నిర్మాతలు మోహన్ బాబు కోసం పాత్రలు సృష్టించి సరైన రీతిలో వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చు. శ్రీనివాస మంగాపురంలో అజయ్ భూపతి చేసిన తడబాటు వల్ల జనం దృష్టిలొ పెద్దగా పడకుండానే ఆ సినిమా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్యారడైజ్ అయినా కొంచెం స్ట్రాంగ్ గా నిలబడితే బాగుంటుంది. ఇదంతా ఎలా ఉన్నా మోహన్‌బాబు సమకాలీకులు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లలో ఎవరో ఒకరితో ఎవరైనా మూవీ ప్లాన్ చేస్తే ఎంత బాగుంటుందో క్లాష్ అఫ్ టైటాన్స్ లాగా.
This post was last modified on September 25, 2026 6:08 am
సెలబ్రిటీలు సోషల్ మీడియాకు స్పందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం టెంప్ట్ అయినా దాని పరిణామాలు అనవసరమైన అపార్థాలకు…
దగ్గరదగ్గర పది.. పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్ పింగ్…
మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ ఊహించని స్థాయిలో అతి పెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా చెబుతున్న దాని…
టాలీవుడ్ రిలీజుల వ్యవహారం కేవలం ప్యాన్ ఇండియాలకే కాదు మీడియం సినిమాలకు సైతం ప్రాణ సంకటంగా మారింది. అక్టోబర్ 2…
పైరసీ వెబ్ సైట్ తో తెలుగు.. తమిళం.. హిందీ.. ఇంగ్లిషు..ఆ భాష.. ఈ భాష అన్న తేడా లేకుండా సినిమాలు…