ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కొన్ని బాధల గురించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతోంది. పురిటి నొప్పులతో పాటు నెలవారీ పీరియడ్స్ బాధల గురించి ఈ మధ్య చాలా చర్చ జరుగుతోంది. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పీరియడ్స్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నెలవారీ రుతు క్రమం వల్ల తాను శారీరకంగా ఎంత ఇబ్డంది పడ్డదీ గుర్తు చేసుకుంటూ.. పురుషులకు కూడా పీరియడ్స్ ఉండాలని వెయ్యిసార్లు దేవుడిని ప్రార్థించినట్లు ఆమె వెల్లడించింది.
ఒకవేళ పురుషులకు పీరియడ్స్ వచ్చేట్లయితే వాళ్లు ఆ రోజుల్లో సెలవులు తీసుకకునేవారంటూ శ్రుతి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో అదితి రావు హైదరి, రాధికా ఆప్టే, రాధికా మదన్ ఉమ్మడిగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ముగ్గురూ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే అనే టాపిక్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ మగవాళ్లకు నెలవారీ రుతుక్రమం వస్తే ఏంటి పరిస్థితి అని యాంకర్ అడిగితే.. ఆ రోజు సెలవు ఉంటుందని రాధికా ఆప్టే వ్యాఖ్యానించింది. అవును.. అది అఫీషియల్ హాలిడే అయ్యేది అని రాధికా మదన్ కామెంట్ చేసింది. మెటర్నటీ లీవ్ ఇచ్చేవాళ్లు అని అదితిరావు హైదరి పేర్కొంది. తర్వాత రాధికా ఆప్టే అందుకుని.. ఈ నొప్పి నివారణకు మందు కనుగొనేవారనిన.. దాని మీద పరిశోధన జరిగేదని వ్యాఖ్యానించింది.
ఇంతలో అదితిరావు అందుకుని.. ఆ బాధకు ఇప్పటికే సరైన మందు కనిపెట్టేసేవారని వ్యాఖ్యానించింది. సడెన్‌గా పురుషులకు పీరియడ్స్ వస్తే అనే ఆలోచన మీద ఇంత చర్చ జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని మీద పురుష నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. పీరియడ్స్, పురుటి నొప్పులతో మహిళలు అప్పుడప్పుడూ పడే బాధ గురించి మాట్లాడుతున్నారు కానీ.. రోజూ కుటుంబ బాధ్యతలు మోస్తూ, ఉద్యోగాలు చేస్తూ పురుషుులు పడే శారీరక, మానసిక బాధ సంగతి మాటేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on September 23, 2026 5:16 pm
డింపుల్ హయతి.. ఈ పేరు వినగానే ఎవరో ముంబయి భామ అనుకుంటారు. ఆమె చేసిన పాత్రలు.. తన అప్పీయరెన్స్ అదీ…
ఆఫీసుకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుని పీజీ నుంచి బయటకు వచ్చిన అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ దగ్గరకు…
సినిమా అనేది యూనివర్శల్ అయినా.. లోకల్‌గా జనాలకు కనెక్ట్ అయ్యే కథాంశాలను ఎంచుకోవడం, ఆయా ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా…
ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి చంద్రబాబు…
కామెడీ హారర్ అనే కొత్త జానర్ సృష్టించి, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ పెట్టి డబ్బులు కొల్లగొట్టే విద్యని మొదట కనిపెట్టింది…
తనకు రావాల్సిన రూ.10 వేల జీతం ఇవ్వలేదనే కోపంతో ఓ మాజీ ఉద్యోగి ఏకంగా రూ.24 కోట్ల నష్టాన్ని చూపించాడు.…