Movie News

డింపుల్ హయతి లో ఈ టాలెంట్ కూడా ఉందా?

డింపుల్ హయతి.. ఈ పేరు వినగానే ఎవరో ముంబయి భామ అనుకుంటారు. ఆమె చేసిన పాత్రలు.. తన అప్పీయరెన్స్ అదీ చూసినా.. తను ఉత్తరాది హీరోయిన్ అనే అభిప్రాయం మరింత బలపడుతుంది. తెరపై చాలా హాట్‌ హాట్‌గా కనిపించే టాలీవుడ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పటిదాకా డింపుల్ నటించిన ప్రతి సినిమాలోనూ చాలా గ్లామరస్‌గానే కనిపించింది. అలాంటి కథానాయికలో ఇప్పుడు ఒక కొత్త యాంగిల్ బయటికి వచ్చింది.

తిరుమల తిరుపతి దేవస్థానం వారి అఫీషియల్ వీడియోలో ఆమె దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా నిర్వహించిన నాద నీరాజనం కార్యక్రమంలో డింపుల్ కూచిపూడి నృత్యంతో సంగీత ప్రియులను, భక్తులను అలరించింది. ఈ కార్యక్రమంలో ఒక సినీ నటి పెర్ఫామ్ చేయడం తొలిసారి. అందులోనూ డింపుల్ ఈ డ్యాన్స్ చేయడం మరింత ఆశ్చర్యం కలిగించేదే.

తనకున్న ఇమేజ్‌కు ఇలాంటి నృత్యాన్ని తన నుంచి ఊహించలేం. డింపుల్ క్లాసికల్ డ్యాన్స్‌లో ట్రెయిన్ అయిందా, తనలో ఈ యాంగిల్ కూడా ఉందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ‘సూపర్ హిట్టు నీ రూటు..’ పాటతో డింపుల్ పాపులర్ అయింది. తర్వాత ఖిలాడి, భర్త మహాశయులకు విజ్ఞప్తి లాంటి చిత్రాల్లో స్టార్ హీరో రవితేజకు జోడీగా నటించింది డింపుల్. ‘రామబాణం’లో గోపీచంద్‌తోనూ జట్టు కట్టింది.

ఐతే పేరున్న సినిమాల్లోనే నటించినా.. ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటిదాకా ఆమె కథానాయికగా నటించిన ఏ సినిమా హిట్ కాలేదు. ప్రస్తుతం డింపుల్ శర్వానంద్ సినిమా ‘భోగి’లో నటిస్తోంది. ఈ సినిమా అయినా పెద్ద హిట్టయి ఆమెకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on September 23, 2026 5:12 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

6 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

7 hours ago