Movie News

మంచి ఛాన్స్ వదిలేసిన బ్లాక్ బస్టర్

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసిన హనుమాన్ అంశ్ ఇప్పటిదాకా మూడు వందల యాభై కోట్ల గ్రాస్ దాటేసిందని బాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్. కేవలం రెండు కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో, ఎక్కువ విఎఫ్ఎక్స్ లేకుండా. స్టార్ క్యాస్టింగ్ తీసుకోకుండా నిర్మించిన ఈ డివోషనల్ డ్రామాకు జనాలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో నలభై రోజుల తర్వాత కూడా ఈ మూవీకి కనీసం రోజుకు ఒకటి రెండు షోలు పడుతూనే ఉన్నాయి.

ఇలాంటివి తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు కాబట్టి ఆ నమ్మకంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దీన్ని పంపిణి చేయడానికి ముందుకొచ్చి ఆ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 18 వస్తుందని పోస్టర్ టీజర్ వచ్చాయి. తీరా చూస్తే చివరి నిమిషంలో హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ థియేటర్లకు రానేలేదు. ఆదర్శ కుటుంబం ఏకె 47 చివరి దశ షూటింగ్ లో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆయన బయటికి వచ్చే పరిస్థితి లేదు. ప్రమోషన్లలో కనిపించకపోతే బాగుండదు. అందుకే మొత్తానికే డ్రాప్ అయ్యారేమో.

ఎలా చూసినా హనుమాన్ అంశ్ ఒక మంచి ఛాన్స్ వదిలేసుకుంది. ఒకవేళ చెప్పిన డేట్ ప్రకారం వచ్చి ఉంటే ఒక వారం రోజులు బలమైన రన్ దక్కేది. ప్యారడైజ్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా హనుమాన్ అంశ్ చూడాలనుకున్న ఆడియన్స్ ఎక్కడికి పోరు. ఒకరోజు అటో ఇటో థియేటర్ కు వెళ్తారు. కానీ క్రమంగా ఈ అడ్వాంటేజ్ సన్నగిల్లుతోంది. ప్యారడైజ్ హిట్ అయితే ఓ రెండు వారాలు దాని ప్రభంజనం ముందు నిలవడం కష్టం ఆ స్థాయిలో హైప్ నెలకొంది.

ఇక ఇప్పుడు యాభై రోజులకు చేరువవుతున్న తరుణంలో హనుమాన్ అంశ్ వచ్చినా రాకపోయినా అంత ప్రభావం ఉండకపోవచ్చని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. అక్టోబర్ మొదటి వారం నుంచే చాలా రిలీజులున్నాయి. వాటికి తట్టుకుని నిలవడం అంత సులభం కాదు. పైగా దసరాకు విజయ్ దేవరకొండ, వెంకటేష్, రజినీకాంత్, ధనుష్ నువ్వా నేను అంటూ పోటీ పడుతూ వస్తున్నారు. సో హనుమాన్ అంశ్ ఆసలు నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

This post was last modified on September 23, 2026 5:30 pm

Share

Recent Posts

కేసీఆర్ అంచ‌నాకు చిక్క‌ని రేవంత్‌!

ఎలాంటి నాయ‌కుడినైనా.. ఎలాంటి పార్టీనైనా త‌న కంటిచూపుతో అంచ‌నా వేయ‌గ‌ల రాజ‌కీయ దురంధ‌రుడిగా మాజీ సీఎం, తెలంగాణ నాయ‌కుడు, బీఆర్ఎస్…

39 minutes ago

మొన్న ఉచితాలు.. నేడు విగ్ర‌హాలు.. అమెరికా పాలిటిక్స్ హీట్‌!

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ధ్యంత‌ర అధ్య‌క్ష ఎన్నిక‌లు కాక రేపుతున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు పార్టీలు.. అనేక ప్ర‌యాస‌లు ప‌డుతున్నాయి. అదే…

42 minutes ago

మగాళ్ళకు పీరియడ్స్ వస్తే..?

ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కొన్ని బాధల గురించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతోంది. పురిటి నొప్పులతో పాటు నెలవారీ పీరియడ్స్…

3 hours ago

డింపుల్ హయతి లో ఈ టాలెంట్ కూడా ఉందా?

డింపుల్ హయతి.. ఈ పేరు వినగానే ఎవరో ముంబయి భామ అనుకుంటారు. ఆమె చేసిన పాత్రలు.. తన అప్పీయరెన్స్ అదీ…

6 hours ago

క్యాబ్ ఎక్కెలోపే బలవంతంగా ముద్దు పెట్టిన సెక్యూరిటీ

ఆఫీసుకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుని పీజీ నుంచి బయటకు వచ్చిన అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ దగ్గరకు…

7 hours ago

ప్యారడైజ్… తెలంగాణలో ఒక పండగ మాదిరి

సినిమా అనేది యూనివర్శల్ అయినా.. లోకల్‌గా జనాలకు కనెక్ట్ అయ్యే కథాంశాలను ఎంచుకోవడం, ఆయా ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా…

7 hours ago